ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Stomach Pain: ఎన్ని మాత్రలు వేసినా కడుపునొప్పి తగ్గట్లేదంటూ.. 13 ఏళ్ల కూతుర్ని ఆస్పత్రికి తెచ్చిందో తల్లి.. టెస్టులు చేసి చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-08T16:12:15+05:30

కడుపు నొప్పి వస్తుంటే చాలామంది పెయిన్ కిల్లర్లు వేసుకుని ఉపశమనం పొందుతూ ఉంటారు. 13ఏళ్ల కూతురు పదే పదే కడుపునొప్పి గురించి ఫిర్యాదు చెస్తుండటంతో ఆ తల్లి కూడా మాత్రలు వేసి సమస్య పరిష్కరించాలని చూసింది. కానీ..

ఆడపిల్లలకు కడుపు నొప్పి అనేది సాధారణ విషయం. అయితే నెలసరి వచ్చినప్పుడో వేడి చేసినప్పుడో కడుపు నొప్ప వస్తుంటుంది. పదే పదే కడుపు నొప్పి వస్తుంటే చాలామంది పెయిన్ కిల్లర్లు వేసుకుని ఉపశమనం పొందుతూ ఉంటారు. 13ఏళ్ల కూతురు పదే పదే కడుపునొప్పి గురించి ఫిర్యాదు చెస్తుండటంతో ఆ తల్లి కూడా మాత్రలు వేసి సమస్య పరిష్కరించాలని చూసింది. కానీ ఎన్ని మాత్రలు వాడినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆమె కూతురును హాస్పిటల్ కు తీసుకెళ్లింది. హాస్పిటల్ లో ఆ బాలికను పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్ లో ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జయలాల్ అనే 13ఏళ్ళ బాలిక(13 years girl) తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఆ పాప తల్లి కడుపు నొప్పి తగ్గడానికి ఎన్ని మాత్రలు మింగించినా ప్రయోజనం లేకపోయింది. పైపెచ్చు ఆ పాప కడుపు క్రమంగా ఉబ్బిపోతుండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రిలో ఆ పాపను పరీక్షించిన వైద్యులు రిపోర్టులు చూసి విస్తుపోయారు. ఆ పాప గర్భవతి అని, ఆమె కడుపులో బిడ్డ పెరుగుతోందని చెప్పారు. దీంతో పాప తల్లి కూడా షాకైంది. ఆ పాపను హాస్పిటల్ లోనే అడ్మిట్ చేసి చికిత్స అందిస్తుండగా మరొక ఊహించని సంఘటన జరిగింది. ఆ పాపకు ఇంకా సరైన వైద్యం అందకముందే హాస్పిటల్ లోని మరుగుదొడ్డికి వెళ్లినప్పుడు అక్కడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటనతో హాస్పిటల్ తో పాటు ఆ ప్రాంతం అంతా కలకలం రేగింది.

Wife-Husband: భర్తతో పొరపాటున కూడా భార్య అనకూడని మాటలివీ.. సరదాకయినా ఈ కామెంట్స్ చేస్తే ఇక అంతే సంగతులు..!



హాస్పిటల్ మరుగుదొడ్డిలో 13ఏళ్ళ బాలిక ప్రసవించిందనే(13 years girl delivery in hospital) సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు చేరుకున్నారు. బాలికను విచారించగా షాకింగ్ నిజం బయటపడింది. బాలిక తల్లికి తమ్ముని వరుస అయ్యే దూరపు బంధువు ఒకరు బాలికను బెదిరించి అత్యాచారం చేశాడని, విషయం ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని ఆ బాలిక చెప్పింది. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే 13ఏళ్ళకే కూతురు తల్లి అయినా, అది అత్యాచారం అని తెలుస్తున్నా ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే నిబంధనల ప్రకారం నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Viral News: కామన్ మ్యాన్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ.200 కోట్లు.. ఊళ్లో అందరికీ మెసేజ్ చూపించి మరీ ఏం చేశారంటే..!


Updated Date - 2023-09-08T16:12:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising