ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aparna Balamurali: హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి

ABN, First Publish Date - 2023-01-19T18:07:17+05:30

అపర్ణా బాలమురళీ‌కి చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాలేజీని సందర్శించగా ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru)తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అపర్ణా బాల మురళీ (Aparna Balamurali). ఈ సినిమాలో ఆమె నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికీ గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది. తాజాగా అపర్ణా బాలమురళీ‌కి చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాలేజీని సందర్శించగా ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అపర్ణా బాల మురళీ తాజాగా ‘తన్కమ్’ (Thankam) సినిమాలో నటించింది. తన సహనటుడు వినీత్ శ్రీనివాసన్ (Vineeth Srinivasan) తో కలసి మూవీ ప్రమోషన్స్ చేస్తుంది. అందులో భాగంగా ఓ లా కాలేజీని సందర్శించింది. ఆమె స్టేజ్‌పై ఉండగా ఓ విద్యార్థి అక్కడికి చేరుకున్నాడు. ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. నిల్చొమని బలవంతం చేశాడు. భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించాడు. యువకుడి ప్రవర్తనతో ఆమె కంగుతింది. సత్వరమే తేరుకుని అతడి నుంచి దూరంగా జరిగింది. ఈ ఘటనపై అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఆ విద్యార్థి స్టేజ్‌పైకి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రతి ఒక్కరు హద్దులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సెలబ్రిటీలు ఎవరు ఈ ఘటనను ఖండించలేదు’’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ‘‘అపర్ణ సహ నటుడు వినీత్ శ్రీనివాసన్ మౌనం ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని మరో నెటిజన్ చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ‘సాటర్ డే నైట్’ మూవీ ప్రమోషన్స్‌లో ఇద్దరు హీరోయిన్స‌కు ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది.

Updated Date - 2023-01-19T18:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising