Michael: అమ్మాయి కోసం ప్రేమికుడి విధ్వంసం
ABN, First Publish Date - 2023-01-23T15:43:03+05:30
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ప్రస్థానం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan). తాజాగా అతడు నటించిన చిత్రం ‘మైఖేల్’ (Michael). సందీప్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ప్రస్థానం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan). తాజాగా అతడు నటించిన చిత్రం ‘మైఖేల్’ (Michael). సందీప్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. రంజిత్ జయకొడి (Ranjit Jaykodi) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. అభిమానులందరు ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
‘మైఖేల్’ ట్రైలర్‌ను సందీప్ కిషన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘‘ఒక అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ మనిషి బ్రతకాలి.. ప్రేమలో పోరాడి దానిని దక్కించుకోలేకపోయిన ప్రతి మనిషికి ఈ ట్రైలర్‌ను అంకితమిస్తున్నాం’’ అని సందీప్ తెలిపాడు. ‘మైఖేల్’ యాక్షన్ నేపథ్యంగా కొనసాగింది. ఒక అమ్మాయి కోసం ప్రేమికుడు సృష్టించిన విధ్వంసాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్, విజయ్ సేతుపతి, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
Updated Date - 2023-01-23T15:44:45+05:30 IST