ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kantara: మేకర్స్‌కు ఊరట.. ‘వరహ రూపం’ పై కీలక ఉత్తర్వులిచ్చిన సుప్రీం కోర్టు

ABN, First Publish Date - 2023-02-10T19:59:56+05:30

కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘వరాహ రూపం’ (Varaha Roopam) పాట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘వరాహ రూపం’ (Varaha Roopam) పాట. సినిమా క్లై‌మాక్స్‌లో వచ్చే ఈ సాంగ్‌కు అందరు ఫిదా అయ్యారు. అయితే, ఈ పాట కాపీ రైట్ సమస్యలను ఎదుర్కొంది. కేరళ హైకోర్టు ఈ సాంగ్‌పై బ్యాన్ విధించింది. ఎక్కడ ప్రదర్శించకూడదని తీర్పునిచ్చింది. అయితే, సుప్రీం కోర్టు ‘వరహ రూపం’ పాటపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ మధ్యంతర ఉత్వర్వులిచ్చింది. నిర్మాతలకు ఊరటనిస్తూ తీర్పును వెలువరించింది. కాపీ రైట్ ఆరోపణలతో ‘కాంతార’ నిర్మాతలు విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur), రిషబ్ శెట్టిలను అరెస్టు చేయకూడదని చెప్పింది. అవసరమయితే వారిని ప్రశ్నించుకోవచ్చాని పేర్కొంది. విజయ్, రిషబ్‌లు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని ఉత్తర్వులిచ్చింది.

కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘థాయికుడమ్‌ బ్రిడ్జ్‌’ (Thaikudam Bridge) ‘వరహరూపం’ పాటపై గతంలో కోర్టును ఆశ్రయించింది. తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌‌ను కాపీ చేసి పాటను తీర్చిదిద్దారంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఫలితంగా కేరళ కోర్టు ఈ పాటపై నిషేధం విధించింది. ఆ బ్యాండ్ అనుమతి లేకుండా పాటను ప్రదర్శించకూడదని తీర్పునిచ్చింది. ఫలితంగా మేకర్స్ ఈ పాటను యూ ట్యూబ్ నుంచి తొలగించారు. ఓటీటీలో కూడా ఈ పాటను.. వేరే సాంగ్‌తో రీ ప్లేస్ చేశారు. తాజాగా వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుతో నిర్మాతలకు ఊరట లభించినట్లైంది. ఇక ‘కాంతార’ మొదట కన్నడ సినిమాగా విడుదలయ్యింది. పలు ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్స్ వెల్లువెత్తడంతో ఇతర భాషల్లోకి అనువదించారు.

Updated Date - 2023-02-10T20:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising