ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Swiggy: రాత్రి 3 గంటలకు ఫుడ్ ఆర్డర్.. పొరపాటున వేరే అడ్రస్‌ను పెట్టిన కస్టమర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..!

ABN, First Publish Date - 2023-11-28T19:43:37+05:30

స్విగ్గీ కస్టమర్ 12 కిలోమీటర్ల దూరంలోని తప్పుడు అడ్రస్ లొకేషన్ పెట్టినా విసుక్కోకుండా రాత్రి 3.00 గంటలకు ఫుడ్ డెలివరీ చేసిన ఓ ఏజెంట్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: మహా నగరాల్లో వేళాపాళా లేని ఉద్యోగాల్లో బిజీగా ఉండేవారికి ఆకలేస్తే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటోలే! కడుపులో ఎలకల పరుగులు మొదలవ్వగానే యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టేస్తాం. ఫుడ్ తెచ్చిచ్చిన డెలివరీ ఏజెంట్‌కి యాంత్రికంగా ఓ థాంక్స్ పడేసి చేతులు దులుపుకుంటాం. అయితే, క్షణాల్లో కడుపాకలి తీర్చే ఈ యాప్‌ల వెనక డెలివరీ ఏజెంట్‌ల నిబద్ధత, కష్టం.. అన్నిటికీ మించిన మానవత్వం దాగుంది. ఈ విషయాన్ని కళ్లకుకట్టినట్టు వివరిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా(Viral) మారింది. మన హైదరాబాద్‌లోనే జరిగిన ఈ ఘటన నెటిజన్లను కదిలిస్తోంది.

Success Story: ఒకప్పుడు విమానాశ్రయంలో స్వీపర్‌గా పనిచేసిన ఇతడే.. ఇప్పుడు 4 కంపెనీలకు బాస్.. కోట్లలో ఆస్తి..!

హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఓ వ్యక్తి ఇటీవల ఓ రోజు రాత్రి హోటల్‌కు ఆలస్యంగా చేరుకున్నాడు. అప్పటికే స్థానిక హోటళ్లన్నీ మూసి ఉండటంతో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అయితే, నగరంపై అతడికి అంతగా అవగాహన లేక యాప్‌లో డెలివరీ అడ్రస్ తప్పుగా ఎంటర్ చేశాడు. తానున్న హోటల్‌కు ఏకంగా 12 కిలోమీటర్ల దూరంలోని డెలివరీ లోకేషన్‌ను ఎంచుకున్నాడు. దీంతో, తప్పుడు ఎడ్రస్‌కు వెళ్లిన డెలివరీ ఏజెంట్ అసలేమాత్రం విసుక్కోకుండా కస్టమర్‌ను వెతుక్కుంటూ 12 కిలోమీటర్ల దూరం వెనక్కు వచ్చి ఫుడ్ ఇచ్చాడు(Swiggy delivery agent travels extra 12 km at 3 am to hand over food).

Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!


‘‘ఆకలిగా ఉన్న వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం మానవత్వం అనిపించుకోదు భయ్యా.. అందుకే ఇంత రాత్రివేళ కూడా వెతుక్కుంటూ వచ్చా’’ అని డెలివరీ ఏజెంట్ చెప్పగానే తనకు మనుషులపై పోయిన నమ్మకం తిరిగొచ్చిందని ఆ నెటిజన్ పేర్కొన్నాడు. తన ఫుడ్ కొంచెం తినమని చెప్పినా అతడు సున్నితంగా వద్దన్నాడని తెలిపాడు. దేవుడిని ప్రార్థించేటప్పుడు మాత్రం తనను గుర్తుపెట్టుకోవాలని చెప్పి వెళ్లపోయాడని పేర్కొన్నాడు. అతడి పేరు ముహమ్మద్ ఆజమ్ అని, అతడిని తను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని ఆ నెటిజన్ ముగించాడు.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అసలు ఏఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి ఇస్తారంటే..!

ఈ ఘటన నెటిజన్లకు అమితంగా నచ్చడంతో డెలివరీ ఏజెంట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ లోకంలో ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారంటే తమకూ మానవత్వం బతికే ఉందన్న నమ్మకం కలిగిందని పలువురు కామెంట్ చేశారు. డెలివరీ ఏజెంట్ చాలా ఫ్రొఫెషనల్ అని మరికొందరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగరం గొప్పదనం ఇదే అంటూ మరికొందరు హర్షం వ్యక్తం చేశారు.

Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!

Viral: వైద్య పరీక్షలకు వెళ్లిన వృద్ధుడు..ఆయన పెద్ద పేగులో ఏముందో చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగే షాక్!

Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!

Updated Date - 2023-11-28T19:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising