Viral: స్విగ్గీ క్రియేటివిటీ మామూలుగా లేదు.. జీ-20 సమ్మిట్‌పై స్విగ్గీ ఆసక్తికర ట్వీట్.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
ABN, First Publish Date - 2023-09-10T14:54:37+05:30
దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమ్మిట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు దేశ రాజధానిలో కొలువై ఉన్నారు. చాలా మంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఏ చిన్న విషయమైనా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) జీ-20 సమ్మిట్ (G20 summit) అంగరంగ వైభవంగా జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు దేశ రాజధానిలో కొలువై ఉన్నారు. చాలా మంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఏ చిన్న విషయమైనా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్ ``స్విగ్గీ`` (Swiggy) ఓ క్రియేటివ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అంతేకాదు గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది.
ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సమ్మిట్‌లో చాలా సీరియస్ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ ట్రెండింగ్ ఈవెంట్‌పై ట్వీట్ చేయడం ద్వారా స్విగ్గీ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఒక కప్పులో టీ, దాని చుట్టూ పార్లే జీ బిస్కెట్లు (Parle G Biscuits) ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ``మా పార్లే జీ-20 సమ్మిట్‌కు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే`` అని కామెంట్ చేసింది. స్విగ్గీ చేసిన ఈ పోస్ట్ ఇన్‌స్టంట్‌గా వైరల్ (Viral Tweet) అయింది. చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు 23 వేల మంది ఈ ట్వీట్‌ను వీక్షించారు.
Shocking Video: భయస్థులు ఈ వీడియో చూడకండి.. ఓ కొండచిలువను మరకొటి ఎలా మింగేస్తోందో.. షాకింగ్ వీడియో వైరల్!
స్విగ్గీ చేసిన ఈ ట్వీట్‌పై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ``స్విగ్గీ క్రియేటివిటీ ఎప్పుడూ అదుర్స్``, ``నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి``, ``టీతో పార్లే జీ బిస్కెట్లు తినడం మధురానుభూతి`` అని కామెంట్లు చేశారు. కాగా, జీ-20 సమ్మిట్ కారణంగా ఢిల్లీలో నాలుగు రోజుల పాటు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-09-10T14:56:32+05:30 IST