ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

The Radio Star: మనుషులతో సంబంధం లేకుండా ఇక డిజిటల్ ప్రెజెంటర్‌లే.., రేడియో జాకీలుగా రాబోతున్నారా?

ABN, First Publish Date - 2023-05-03T17:03:07+05:30

రాబోయే రోజుల్లో పనిగట్టుకుని ఒకరు మాట్లాడాల్సిన పనిలేదు. సమయాన్ని వెచ్చించి, గంటల తరబడి మాట్లాడాల్సిన పనికూడా ఉండదేమో..

technology and social media.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు రేడియో అంటే వినోద సాధనం.మనకు వార్తల్ని అందించేదే కాదు. రకరకాల కబుర్లను చెబుతూ కాలక్షేప మాధ్యమంగా ఉండేది. ఈ రేడియోలో వినిపించే ఆర్జే గొంతుకులకు విపరీతమైన ఫేన్స్ ఉండేవారు. వారి గొంతును గుర్తుపట్టి ఆ ఆర్జే కార్యక్రమం రాగానే వెంటనే రేడియో ముందు వాలిపోయేవారు శ్రోతలు. అలాగే ప్రముఖులు చాలా మంది నాటకాల ద్వారా, పాటల ద్వారా కూడా రేడియోలో ఫేమస్ గా నిలిచారు. అయితే ఇప్పుడు ఈ రేడియో ఆర్జేల కాలానికి చెల్లు చీటీ తయారైందేమో.. ఇక చక్కని శ్రావ్యమైన గొంతుకలతో ఓ మనిషి కూర్చునే చోట డిజిటల్ ఆర్జేలు, రోబో ప్రెజెంటర్‌లు ఉండబోతున్నారట.

దీనిని ఆరంభించింది మాత్రం 102.4 మిర్చి కమర్షియల్ రేడియో. ఇది ఒక రకమైన ఆవిష్కరణలను ప్రారంభించడంతో 102.4 మిర్చి, UAEలో మనం రేడియో వినే విధానాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఒక అడుగు ముందుకు వేస్తూ, సమయంతో పాటుగా కదులుతూ, 102.4 మిర్చి వాణిజ్య రేడియో స్టేషన్‌లో ప్రపంచంలోని మొట్టమొదటి AI ప్రెజెంటర్‌ను పరిచయం చేసింది.

ఇది కూడా చదవండి: కొవ్వు కాలేయం ఎంతగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటే.. మానసిక, శారీరక సమస్యలన్నింటికీ అదే కారణమట..ఇంకా..!

AIలో మిర్చి అనే కార్యక్రమంలో AIRAH (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేడియో హోస్ట్) అనే రేడియో ప్రెజెంటర్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రేడియో కార్యక్రమాలను నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం సాంకేతికత, సోషల్ మీడియా అన్ని విషయాలను కవర్ చేసే ఆహ్లాదకరమైన ప్రదర్శనగా ఉంటుందట.

డాల్ఫిన్ రికార్డింగ్ స్టూడియో సరికొత్త ఆవిష్కరణ రాబోయే రోజుల్లో రేడియోలో కొత్త ఆరంభానికి తెర లేపింది. ఓ టర్న్‌కీ గ్రౌండ్ బ్రేకింగ్ అవుతుంది. 102.4 మిర్చి కొత్త రేడియో ఆవిష్కరణ తాజా ప్రయోగంతో వాణిజ్య రేడియో రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పునాదిని వేసిందని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో పనిగట్టుకుని ఒకరు మాట్లాడాల్సిన పనిలేదు. సమయాన్ని వెచ్చించి, గంటల తరబడి మాట్లాడాల్సిన పనికూడా ఉండదేమో.. అలా ప్రోగ్రామింగ్ చేసిన విధంగా రేడియో కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఇక రాబోయే రోజుల్లో వేటికీ మనుషుల శ్రమతో అవసరం లేకుండా జరుగుతుందేమో.. చూడాలి.

Updated Date - 2023-05-03T17:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising