Temjen Imna: ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నాగాలాండ్ మంత్రి తమాషా ట్వీట్..అదేంటో చూడండి..
ABN, First Publish Date - 2023-03-17T21:24:08+05:30
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ మంత్రి (Nagaland Minister) తెమ్‌జేన్ ఇమ్నా(Temjen Imna Along) చేసిన ఓ తమాషా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.
Nagaland: ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ మంత్రి తెమ్‌జేన్ ఇమ్నాచేసిన ఓ తమాషా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్యాస్పదంగా, చమత్కరిస్తూ సోషల్ అవేర్‌నెస్ కలిగించే పోస్టులను ట్వీట్ చేయడంలో నాగాలాండ్ మంత్రి తెమ్‌జేన్ ఇమ్నా దిట్ట. తాజాగా ఆయన చేసిన ఓ కొత్త పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గదిలో తన సహచరులతో కలిసి కుర్చీలో కూర్చొని నిద్రిస్తున్న ఫొటోను తెమ్‌జేన్ ఇమ్నా పోస్ట్ చేశాడు. అంతేకాదు..‘‘ఈ చిన్ని కళ్లవాళ్లను మేం అభినందిస్తున్నాము. 24 గంటలు మేల్కొని ఉండటం ఎల్లప్పుడూ సరైంది కాదని’’ రాసి ట్యాగ్ చేశారు. అయితే ఈ పొటోను షేర్ చేయడంలో తెమ్‌జేన్ ఇమ్నా ఉద్దేశమేమిటో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా. చట్టసభల్లో, ముఖ్యమైన సమావేశాల్లో నిద్రించే నేతలకు ఈ ఫొటో ద్వారా తెమ్‌జేన్ చురకలంటించినట్లుగా ఉందికదూ.!
Updated Date - 2023-03-17T21:24:34+05:30 IST