ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Thief: కృష్ణుడి గుడిలో నగల చోరీ.. 9 ఏళ్ల తర్వాత తిరిగి పంపించేసిన దొంగ.. నగల మూటలో ఉన్న ఓ కాగితంలో అతడు రాసింది చదివి..!

ABN, First Publish Date - 2023-05-17T13:57:21+05:30

అతడు ఒక దొంగ.. తొమ్మిదేళ్ల క్రితం కృష్ణుడి గుడిలో నగల దొంగతనం చేశాడు.. ఆ దొంగను ఇప్పటివరకు ఎవరూ పట్టుకోలేకపోయారు.. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఆ దొంగ పశ్ఛాత్తాపం వెలిబుచ్చాడు.. తాను చోరీ చేసిన నగలను ఆ గుడికి తిరిగి పంపించేశాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతడు ఒక దొంగ (Thief).. తొమ్మిదేళ్ల క్రితం కృష్ణుడి గుడిలో నగల దొంగతనం చేశాడు.. ఆ దొంగను ఇప్పటివరకు ఎవరూ పట్టుకోలేకపోయారు.. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఆ దొంగ పశ్ఛాత్తాపం వెలిబుచ్చాడు.. తాను చోరీ చేసిన నగలను ఆ గుడికి తిరిగి పంపించేశాడు.. ఆ నగలతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా పంపించాడు.. ఆ ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా (Odisha)లోని భువనేశ్వర్‌ (Bhubaneshwar)లో ఈ ఘటన జరిగింది (Thief returned stolen jewelry).

భువనేశ్వర్‌కు సమీపంలోని గోపీనాథ్‌పూర్ గ్రామంలోని కృష్ణుడి గుడిలోని (Lord Krishna`s Temple) స్వామి వారి నగలను తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఓ దొంగ అపహరించాడు. ఆ నగల విలువ అప్పట్లోనే సుమారు రూ. 4 లక్షలు. అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. కానీ దొంగను పట్టుకోలేకపోయారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత ఆ దొంగే దేవుడి నగలను తిరిగి పంపించేశాడు. ఆ నగలతో పాటు ఉత్తరాన్ని కూడా ఉంచాడు. అలాగే తన పాప పరిహారంగా కొంత నగదును కూడా పంపించాడు. తాను ఎందుకు నగలు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఉత్తరంలో రాశాడు (Viral News).

Lovers on Scooty: వామ్మో.. ఈ లవర్స్ స్టంట్స్ మామూలుగా లేవుగా.. స్కూటీపై వెళ్తూ ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని మరీ..!

``తొమ్మిదేళ్ల క్రితం గుడిలో యాగం జరుగుతున్నప్పుడు ఆభరణాలు దొంగిలించాను. నగలు దొంగిలించిన తర్వాత, ఈ తొమ్మిదేళ్లలో నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. అందుకే నేను నగలు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నగలతో పాటు రూ.301 పంపుతున్నాను. అందులో రూ. 201 ఆలయానికి, మరో వంద నేను చేసిన పనికి జరిమానా`` అని ఆ ఉత్తరంలో రాశాడు. అయితే ఆ ఉత్తరంలో తన పేరు, చిరునామా మాత్రం ఆ దొంగ రాయలేదు.

Updated Date - 2023-05-17T13:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising