ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: మొబైల్ షాపు యజమానికి భారీ షాక్..ఆ రాత్రి షాపులో ఏం జరిగిందో సీసీటీవీ కెమెరాలో చూసి..

ABN, First Publish Date - 2023-10-21T19:37:49+05:30

ఆ రాత్రి ఎప్పటిలాగే మొబైల్ షాపు కట్టేసి ఇంటికెళ్లాడు ఆ షాపు యజమాని. మరుసటి రోజు ఉదయం తిరిగొచ్చి చూసేసరికి షాపు గోడకు ఓ పెద్ద కన్నం కనిపించింది. షాపులో కెళ్లి చూసేసరికి అతడు భయపడినదంతా జరిగింది. ఇది చాలదన్నట్టు సీసీటీవీ కెమెరాలో దొంగల తెలివితేటలు చూసి ప్రత్యక్షంగా షాకైపోయాడా షాపు యజమాని.

ఇంటర్నెట్ డెస్క్: ఆ రాత్రి ఎప్పటిలాగే మొబైల్ షాపు కట్టేసి ఇంటికెళ్లాడు ఆ షాపు యజమాని. మరుసటి రోజు ఉదయం తిరిగొచ్చి చూసేసరికి షాపు గోడకు ఓ పెద్ద కన్నం కనిపించింది. షాపులో కెళ్లి చూసేసరికి అతడు భయపడినదంతా జరిగింది. ఇది చాలదన్నట్టు సీసీటీవీ కెమెరాలో దొంగల తెలివితేటలు ప్రత్యక్షంగా చూసి షాకైపోయాడా షాపు యజమాని. ఉత్తర‌ప్రదేశ్‌లో మీరట్ నగరంలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన.

Agra: బాబోయ్..ఇలాక్కూడా జరుగుతుందా? గుండెకు దగ్గరగా ఫోన్ ఉండటంతో తప్పిన ప్రాణాపాయం!

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..


పూర్తి వివరాల్లో్కి వెళితే, స్థానిక గంగానగర్‌లో లక్ష్మీ మొబైల్ షోరూం ఉంది. షాపు పక్కనే ఓ ఖాళీ స్థలం కూడా ఉంది. అయితే, ఇటీవల ఓ రోజు రాత్రి షాపులో దొంగలు పడ్డారు. షాపు గోడకు కన్నం వేసీ మరీ లోపలకు వెళ్లారు. అయితే, లోపల సీసీటీవీ కెమెరాలు ఉంటాయని ముందే ఊహించిన దొంగలు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. పీపీటీ కిట్స్, గ్లోవ్స్ ధరించి చోరీకి వచ్చారు. ఆ తరువాత షాపులో ఉన్న మొత్తం రూ.60 లక్షల విలువైన ఫోన్లను తీసుకెళ్లిపోయారు.

H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!


మరుసటి రోజు షాపు యజమాని వచ్చి జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. సీసీటీవీలో తమ ముఖాలు కూడా కనబడకుండా దొంగలు పీపీకిట్లు ధరించి రావడం చూసి అవాక్కయ్యాడు. దొంగల తెలివికి లబోదిబోమన్న అతడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. చోరీ నేపథ్యంలో స్థానిక షాపు యజమానులు ఆ ప్రాంతం భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

Updated Date - 2023-10-21T19:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising