Fire Damaged Ferrari: ప్రమాదంలో తుక్కుతుక్కయిన కారు.. పోటీపడి మరీ రూ.15 కోట్లకు కొనేశారు.. ఎందుకింత స్పెషల్ అంటే..!
ABN, First Publish Date - 2023-08-21T16:49:00+05:30
కాలిపోయిన డొక్కు కారును వేలం వేస్తే అది దాదాపు 15 కోట్ల రూపాలకు ధర పలికింది.
కొత్త వింత పాత రోత అనే సామెతకు ఇది అచ్చంగా రివర్స్.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాటకు సరిగ్గా సరిపోతుందేమో.. అదిగో సరిగ్గా దీనికి సరిపోయేట్టే.. మంటల్లో కాలిపోయి.. ప్రమాదానికి గురైన ఓ కారు.. దాదాపు 69 ఏళ్ళ తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అంటే ఇదేదో వజ్రాలు, బంగారంతో తయారైందని కాదు. కార్ రేస్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ కారుకు చాలా చరిత్రే ఉంది. అసలు ఈ కారు కథలోకి వెళితే..
కాలిఫోర్నియా దేశానికి సంబంధించి వింటేజ్ కార్లకు చాలా అదరణ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఈమధ్య కాలంలో నిర్వహించిన వేలంలో తుక్కు తుక్కుగా మారి, కాలిపోయిన డొక్కు కారును వేలం వేస్తే అది దాదాపు 15 కోట్ల రూపాలకు ధర పలికింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఆర్ఎం సోథెబీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో ఫెరారీ 500 మాండియల్ స్పైడర్ సిరీస్ 1 మోడల్ కారును భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఈ కారు 1960లో ప్రమాదానికి గురైంది. ఈ కారుకు ఇంకా బోలెడు చరిత్ర ఉంది. ఇటాలియన్ రేసింగ్ డ్రైవర్ అల్బెర్టో అస్కరీ 1952, 53 సాధించిన విజయాలకు గుర్తుగా ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్ షిప్, విజయాలకు గర్తుగా ఫెరారీ సంస్థ ఈ రేస్ కారును తయారు చేసింది.
ఇది కూడా చదవండి: కష్టమైనా సరే.. మిరియాలను రోజుకు ఒక్కటైనా తినండి.. వంటింట్లో ఉండే వీటిని పెద్దగా వాడరు కానీ..!
దీని బాడీని ప్రఖ్యాత ఇటాలియన్ డిజైన్ సంస్థ పినిన్ ఫరీనా తయారు చేసింది. ఆ ఫెరారీ మొదటి విజయాన్ని అందుకున్నది డ్రైవర్ ఫ్రాంక్ కోర్టేస్.. ఆయన ఈ కారును 1954 కొనుగోలు చేసి 1958లో అమెరికా తీసుకువెళ్ళాడు.
1960లో ఓ ప్రమాదంలో కారు మంటల్లో చిక్కుకుని, పూర్తిగా కాలిపోయింది. అప్పటి నుంచి చాలా చేతులు మారింది. చివరిగా ఈ కారును కొనుగోలు చేసిన వ్యక్తి దాదాపు 45 ఏళ్ళపాటు పాడైన స్థితిలోనే వదిలేసి ఉంచాడు. తాజాగా వేసిన వేలంలో ఈ కారును 15 కోట్లకు కొనుగోలు చేసిన వ్యక్తి కారును బాగు చేసి మళ్ళీ రేసింగ్ కు ట్రాక్ పై పరుగులు పెట్టిస్తానని చెప్పాడు.
Updated Date - 2023-08-21T16:49:00+05:30 IST