ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరు మార్చుకుని పాకిస్తాన్ కు వెళ్ళాడు.. పాక్ ఆర్మీలో చేరాడు.. కానీ చివరికి ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-03-06T11:36:11+05:30

పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఆర్మీలో చేరి.. కీలకపాత్ర పోషించి.. చివరికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డిటెక్టివ్ సినిమాలు, నవలలు ఇష్టపడే వారికి రా ఏజెంట్స్(RAW Agent) గురించి తెలిసే ఉంటుంది. తన దేశం నుండి మరొక దేశానికి వెళ్ళి అక్కడి వ్యక్తిలా కలిసిపోయి, అక్కడి రహస్యాలను(Secrets) తన దేశానికి గుట్టుచప్పుడు కాకుండా చేరవేయడం రా ఏజెంట్ ల కర్తవ్యం. అలా రా ఏజెంట్ గా 23సంవత్సరాల వయసులో పాక్ గడ్డమీద కాలుమోపిన రవీంద్ర కౌశిక్.. పాకిస్తాన్ ఆర్మీలో కీలక పాత్ర పోషించాడు. చివరికి పాక్ చేతిలోనే మరణించిన ఈయన జీవితం గురించి తెలుసుకుంటే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో రవీంద్ర కౌశిక్ జన్మించాడు. ఈయనకు నాటకరంగం మీద చాలా ఆసక్తి ఉండేది. దాంతో స్టేజి ప్రదర్శనలు ఇచ్చేవాడు. డ్రామాకు రా అధికారి(RAW Officer) ఒకరు హాజరయ్యారు. ఆ డ్రామాలో రవీంద్ర పాత్రలో లీనమైపోయి నటించడం ఆ రా ఏజెంట్ ను ఆకర్షించింది. దాంతో రవీంద్రను రా ఏజెంట్ గా తీసుకున్నారు. అప్పటికి రవీంద్ర వయసు 23సంవత్సరాలు. 23సంవత్సరాల వయసులో రవీంద్ర తన పేరును నబీ అహ్మద్ షకీర్ గా మార్చుకుని పాక్ లో అడుగుపెట్టాడు. అతనికి సంబంధించిన రికార్డులన్నీ భారత్ లో తొలగించారు. ఒక ముస్లిం వ్యక్తిగా, పాక్ పౌరుడిగా అందరినీ నమ్మించడానికి వేష భాషలతోపాటు.. ఉర్దూ, ఇస్లామిక్ సాహిత్యాన్ని అవపోషన పట్టాడు. పూర్తి పాకీస్తానీ వ్యక్తిగా తనను తాను మార్చుకున్నాడు. పాకిస్తాన్ వెళ్ళిన తరువాత కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. లాహోర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని న్యాయశాస్త్రం పూర్తి చేశాడు. చదువు తర్వాత రవీంద్ర పాకిస్థాన్ సైన్యంలో చేరాడు. అదే సమయంలో పాకిస్తాన్ మిలటరీ అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ పెళ్ళికి దారితీసింది. పెళ్ళయిన కొంత కాలానికి వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.ఆ పిల్లాడికి అరీబ్ అహ్మద్ అని పేరు పెట్టుకున్నారు. ఇలా పాకిస్తాన్ లో అతనికి కొత్త జీవితం, కొత్త కుటుంబం ఏర్పడినా తను వెళ్ళిన పనిని మాత్రం విస్మరించలేదు. పాకిస్తాన్ రహస్యాలను ఎన్నింటినో భారత్ కు చేరవేసేవాడు. ముఖ్యమైన సమాచారాలన్నీ పంపేవాడు.

Read also: బంగారాన్ని దోచేందుకు సొరంగాన్నే తవ్వేశారు.. చివరకు క్షమించండంటూ గోడపై రాసి ఎస్కేప్.. బంగారాన్ని అందుకే తీసుకెళ్లలేదట..!


రవీంద్ర అన్నేళ్ళుగా భార్యతో జీవితం గడుపుతున్నా ఎప్పుడూ తను భారత్ రా ఏజెంట్ ను అనే విషయం ఆమెకు కూడా చెప్పలేదు. అంత రహస్యంగా తన పనులు చేసేవాడు. అయితే పాకిస్తాన్ లో ఉన్న ఒక జూనియర్ ఏజెంట్ రవీంద్ర గురించి మెల్లగా కూపీ లాగడం మొదలుపెట్టాడు. అది చివరికి రవీంద్ర గుట్టు బయటపడేలా చేసింది. దీంతో 1983సంవత్సరంలో రవీంద్రను పాక్ సైన్యం అరెస్ట్ చేసింది. నిజం తెలిసిన తరువాత రవీంద్రను ఒక్కసారిగా చంపేయకుండా జైలులో ఉన్నన్ని రోజులు పాక్ సైన్యం నరకం చూపించింది. 18ఏళ్ళ పాటు పాక్ చెరలో బంధీగా ఉన్న రవీంద్ర 2011లో పాక్ లోని ఉన్రీ జైలులో మరణించాడు. ఇప్పటికీ రవీంద్ర భార్య, కొడుకు పాకిస్తాన్ లో ఉన్నారు. కానీ వారెక్కడున్నారో తెలియదు. రవీంద్ర జీవితం ఆధారంగానే బాలీవుడ్ లో ఆలియా భట్, విక్కీ కౌషల్ ప్రధాన పాత్రధారులుగా 'రాజీ' అనే సినిమా వచ్చింది. ఇందులో రవీంద్రలా ఆలియా భట్ భారత్ రా ఏజెంట్ పాత్ర పోషించింది.

Updated Date - 2023-03-06T12:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising