ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weight Loss: 294 కేజీల బరువున్న వ్యక్తి నాలుగేళ్లలో 130 కేజీలకు తగ్గిపోయాడు.. సర్జరీ అస్సలు కాదు.. కానీ ఏకంగా 164 కేజీలు ఎలా తగ్గాడంటే..

ABN, First Publish Date - 2023-03-22T16:41:54+05:30

అధిక బరువు (Over weight).. ప్రస్తుత సమాజంలోని అందరినీ అందోళనకు గురి చేస్తున్న ఒకే ఒక అంశం. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల బరువు పెరిగిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అధిక బరువు (Over weight).. ప్రస్తుత సమాజంలోని అందరినీ అందోళనకు గురి చేస్తున్న ఒకే ఒక అంశం. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల బరువు పెరిగిపోయి, మధుమేహం (Diabetes), రక్తపోటు (Blood Pressure) వంటి లైఫ్ స్టైల్ రోగాలు ఎక్కువైపోయాయి. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఎంతో మంది నానా కష్టాలు పడుతున్నారు. అయితే పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత సులభం కాదు. కఠినమైన డైటింగ్, వ్యాయామం నెలల తరబడి కఠోర దీక్షతో చేస్తేనే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం వీలవుతుంది. సర్జరీ ద్వారా బరువు తగ్గించుకునే వీలున్నా దాని వెనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

అమెరికాకు చెందిన నికోలస్‌ క్రాఫ్ట్‌ (Nicholas Craft) అనే వ్యక్తి 2019లో ఏకంగా 294 కిలోల బరువుతో ఉండేవాడు. వీలైనంత త్వరగా బరువు తగ్గకపోతే మూడేళ్లకు మించి బతకవని డాక్టర్లు చెప్పడంతో నికోలస్ తన వెయిట్ లాస్ (Weight loss) జర్నీని ప్రారంభించాడు. డాక్టర్ చెప్పిన నియమాలను నాలుగేళ్లపాటు పాటించి 165 కేజీలు తగ్గి ఔరా అనిపించాడు. ``బరువు తగ్గేందుకే నేనేం మరీ కఠినమైన నిబంధనలు పాటించలేదు. నేను తినే విధానాన్ని మార్చుకున్నానంతే. ముందుగా సోడా, వేచిన పదార్థాలు, బ్రెడ్, పాస్తాలను తీసుకోవడం పూర్తిగా మానేశాను. రైస్ కూడా మానేశాను. వాటి స్థానంలో పళ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఫుడ్స్ తీసుకునేవాడిని.

Big Alert to Bachelors: బ్యాచులర్స్‌కు గుండె దడ తెప్పించే వార్త.. పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టాలే అనుకునే వాళ్ల కోసమే..!

ఆహారంలో మార్పులు చేసుకుని నడక, వెయిట్ లిఫ్టింగ్ చేయడం ప్రారంభించాను. అంతకు మించి నేనేం చేయలేదు. కాకపోతే నేను వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించిన తర్వాత ఒక్కరోజు కూడా నియమం తప్పలేదు. పూర్తిగా సాధారణ పద్ధతుల్లోనే బరువు తగ్గాను. బరువు తగ్గేందుకు మందులు తీసుకోలేదు. షార్ట్ కట్స్‌తో బరువు తగ్గాలనుకుంటే ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. సహజ సిద్ధంగా బరువు తగ్గాలనుకుంటే ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. చాలా సహనం కావాలి. కానీ, అదే ఆరోగ్యవంతమైనద``ని నికోలస్ తెలిపాడు. నాలుగేళ్లలో నికోలస్ ఏకంగా 165 కేజీలు తగ్గి ప్రస్తుతం 130 కిలోలకు చేరుకున్నాడు.

Dog Food: కుక్కకు పెట్టే ఆహారాన్ని మనుషులు తినకూడదా..? ఓ వ్యక్తి అదే పనిగా డాగ్ ఫుడ్‌ను తినడంతో ఏం జరిగిందంటే..

Updated Date - 2023-03-22T16:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising