ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-08-20T07:44:59+05:30

నేడు (20-8-2023 - ఆదివారం ) మేష రాశివారికి పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. అలాగే వృషభ రాశి వారికి క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. తుల రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారు నేడు అన్ని వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...

నేడు (20-8-2023 - ఆదివారం ) మేష రాశివారికి పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. అలాగే వృషభ రాశి వారికి క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. తుల రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారు నేడు అన్ని వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌, పాఠశాలల రంగాలకు చెందిన వారికి అనుకూలమైన రోజు. దుర్గాదేవి ఆరాధనతో మంచి ఫలితాలు అందుకుంటారు.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. గోసేవ మేలు చే స్తుంది.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. అనుకున్న చోట అడ్మిషన్లు పొందుతారు. రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కనకధారాస్తోత్ర పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రాంతాల్లో చదివేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, కన్సల్టెన్సీ, ఎగుమతుల రంగాల వారికి అనుకూలమైన రోజు. స్వచ్ఛంద సేవలో పాల్గొనండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, ఫోటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌ వ్యాపారులకు అనుకూలమైన రోజు.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. యూనియన్‌ కార్యకలాపాలకు అనుకూలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బోనస్‌లు, ఇంక్రి మెంట్లు అందుకుంటారు. పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. బీమా, గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రక్షణ, బోధన, న్యాయ, ప్రచురణల రంగాల వారికి అనుకూలమైన రోజు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, ఫార్మా, బ్యాంకింగ్‌, మరమ్మతుల రంగాల వారికి అనుకూలమైన రోజు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. గోసేవ మేలు చేస్తుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-08-20T07:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising