Horoscope : రాశిఫలాలు
ABN, First Publish Date - 2023-10-02T07:18:05+05:30
నేడు (2-10-2023 - సోమవారం) వృషభ రాశి వారికి ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు....
నేడు (2-10-2023 - సోమవారం) వృషభ రాశి వారికి ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. మీనరాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు, పన్నుల, బీమా వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో ఖ ర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శివారాధన మంచిది.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వ్యాపార రంగంలోని వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన మనులు వాయిదా పడటంతో మనసు చికాకుగా ఉంటుంది. రుద్రకవచ పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా వుంటుంది. మనసు ఉల్లాసంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభుఉ్యల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శివ పంచాక్షరిని జపించడం మంచిది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పైఅధికారులతో చర్చలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని రీతిలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రుద్రకవచ పారాయణ మంచిది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్, ప్రకటనలు, ట్రావెల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సాంత్వన లహాస్తుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలం. ఇన్‌స్టాల్‌మెంట్లు, లోన్‌లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సూర్యదేవుని ఆరాధన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ప్రియతముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. గోసేవలో పాల్గొనండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, ఆస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. సహోద్యోగుల సహకారం లో పించడంతో లక్ష్య సాధనలో ఇబ్బందులు పడతారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సేవాకార్యక్రమాలు మనసుకు సంతోషాన్నిస్తాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ప్రేమలు ఫలిస్తాయి. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన, ఆడిటింగ్, గార్మెంట్స్ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించది. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. శివారాధన మంచిది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
దూరంలో వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. అమ్మవారిని ఆరాధించండి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
స్నేహానుబంఽధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంఽధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. కమ్యూనికేషన్ రంగంలోని వారికి శుభప్రదం. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. గోసేవ శుభప్రదం
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - 2023-10-02T07:18:05+05:30 IST