ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-08-02T07:27:38+05:30

నేడు (2-8-2023 - బుధవారం) మేషరాశి వారికి బృంద కార్యక్రమాల కోసం ఖర్చు అంచనాలు మించే అవకాశం ఉంది. ఇక వృషభరాశి వారికైతే ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. సింహరాశివారికి అయితే అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. మకర రాశివారు నేడు జాగ్రత్తగా ఉండాలట.

నేడు (2-8-2023 - బుధవారం) మేషరాశి వారికి బృంద కార్యక్రమాల కోసం ఖర్చు అంచనాలు మించే అవకాశం ఉంది. ఇక వృషభరాశి వారికైతే ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. సింహరాశివారికి అయితే అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. మకర రాశివారు నేడు జాగ్రత్తగా ఉండాలట. లేదంటే విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉందట. ఇక దాదాపు అన్ని రాశుల వారి ఫలితం బాగానే ఉంది. ఇక ఆలస్యమెందుకు మీ రాశి ఫలితం నేడు ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన సమాశాలు ఫలిస్తాయి. బృందకార్యక్రమాల కోసం ఖర్చు అంచనాలు మించే అవకాశం ఉంది.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలకు అనుకూలం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు లభిస్తాయి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

మీ అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, వేడుకలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వాహనాల కొనుగోలుకు అనుకూలం. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బీమా, మూచ్యువల్‌ఫండ్స్‌ లావాదేవీలకు అనుకూలం. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మరమ్మతులకు వెచ్చిస్తారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ప్రియతములతో చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు అధికం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉపాధి, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, చర్చల్లో కొంత నిదానం పాటించాలి. విష్ణుమూర్తి ఆరాధన మంచిది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. చిట్‌ఫండ్‌లు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితిపై ప్రియతములతో చర్చిస్తారు. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. వ్యయం అధికం. గణపతి ఆలయాన్ని దర్శించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. అద్దె నిర్ణయం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. తల్లిదండ్రుల వైఖరి కొంత ఆ వేదన కలిగిస్తుంది. ఆలయదర్శనం శుభ ప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సోదరీసోదరుల విషయాలను సమీక్షించుకుంటారు. విలువైన పత్రాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. రహస్య సమాచారం తెలుసుకుంటారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బహుమతులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులపై బంధుమిత్రులతో చర్చిస్తారు. ఉత్సవాలు, ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో సత్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. గౌరవ మన్ననలు పెంపొందుతాయి. ప్రముఖులతో సమావేశాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సమావేశాలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-08-02T07:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising