ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-09-14T08:16:46+05:30

నేడు (14-9-2023 - గురువారం) మేష రాశి వారికి సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

నేడు (14-9-2023 - గురువారం) మేష రాశి వారికి సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారు షాపింగ్ ఖర్చులు బీభత్సంగా ఉంటాయి. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. ఫార్మా, హాస్టళ్లు, ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదరయ్యే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ కోసం ఖర్చులు అధికం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. భూములు, ఇళ్ల క్రయవిక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. హార్డ్‌వేర్‌, నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్‌ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అన్నదానం శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

డ్రైవింగ్‌లో నిదానం పాటించండి. రాతకోతల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. చెక్కులు, పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడతారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీ గాయత్రీ మాతను ఆరాధించండి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాటపెట్టే అ వకాశం ఉంది. విలాలసాకు ఖర్చు చేస్తారు. దత్తకవచం పారాయణ చేయండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. గోసేవ మంచిది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, విదేశీ వ్యవహరాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా పూర్తవుతాయి. యోగధ్యానాలకు అనుకూల సమయం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యతను గమనించాలి. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, వడ్డీ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవమర్యాదలకు భంగం కలగడచ్చు. సాయిబాబాను దర్శించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, ఈ వెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. గాయత్రీమాతను ఆరాధించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సకాలంలో డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. పన్నులు, బ్యాంక్‌లోన్‌ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పెన్షన్‌, మెడికల్‌ క్లెయిములు వ్యవహారాలు పరిష్కారం అ వుతాయి. గోసేవ వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదరయ్యే అ వకాశం ఉంది. న్యాయ వివాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అ వకాశం ఉంది. పందాలు పోటీలకు దూరంగా ఉండాలి. సాయిబాబా ఆరాదన మేలు చేస్తుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-09-14T08:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising