Horoscope : రాశిఫలాలు
ABN, First Publish Date - 2023-10-22T06:57:13+05:30
నేడు (22-10-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. కన్య రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్ విషయంలో నాణ్యత గమనించాలి.
నేడు (22-10-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. కన్య రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్ విషయంలో నాణ్యత గమనించాలి. సింహరాశి వారికి వ్యాపార రంగాలకు చెందిన వారికి ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్శ చూపించాలి. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బోనస్లు, ఇంక్రిమెంట్ల విషయంలో కొంత ఆశా భంగం ఎదురుకావచ్చు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, కన్సల్టెన్సీ రంగాల వారు శ్రమకు తగిన ఫలితం అందక నిరుత్సాహపడతారు. దుర్గాదేవి ఆరాధన మంచిది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆ రోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వ్యాపార రంగంలోని వారు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం కాదు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లలో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. న్యాయ వివాదాలకు ఆస్కారం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపార రంగాలకు చెందిన వారికి ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్ విషయంలో నాణ్యత గమనించాలి. ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. క్రీడలు, టెలివిజన్, చిట్ఫండ్ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. గృహనిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన అంశాల్లో నిదానం పాటించాలి. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దుర్గాదేవి ఆరాధన మంచిది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఒక సమాచారం ఆవేదన కలిగస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నదమ్ములకు సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ మంచిది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మననస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. బృందకార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. దుర్గాదేవిని ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెద్దల వైఖరి ఆవేధన కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దుర్గాష్టక పారాయణ మంచిది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, ఉత్సవాలు, పూజల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో అసౌకర్యం కలుగుతుంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితుల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సమావేశాలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార విషయాల్లో నిదానం అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - 2023-10-22T07:03:49+05:30 IST