ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-11-01T07:54:23+05:30

నేడు (1-11-2023 - బుధవారం) మేషం రాశి వారికి స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. మిథునం రాశివారికిబ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

నేడు (1-11-2023 - బుధవారం) మేషం రాశి వారికి స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. మిథునం రాశివారికిబ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. తుల రాశివారికి రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు.. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. కమ్యూనికేషన్‌ రంగంలోని వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రియతముల ఆరోగ్యం కొంత ఆవేదన కలిగిస్తుంది. రామాలయాన్ని దర్శించండి.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. గణపతి ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపార రంగంలోని వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. విష్ణుసహస్రనామ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన మనులు వాయిదా పడటంతో మనసు చికాకుగా ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా వుంటుంది. మనసు ఉల్లాసంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రామరక్షాస్తోత్ర పారాయణ మంచిది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పైఅధికారులతో చర్చలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని రీతిలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గణపతి ఆరాధన శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సాంత్వన లహాస్తుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ లావాదేవీలకు అనుకూలం. ఇన్‌స్టాల్‌మెంట్లు, లోన్‌లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మహాగణపతి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ప్రియతముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. సహోద్యోగుల సహకారం లో పించడంతో లక్ష్య సాధనలో ఇబ్బందులు పడతారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సేవాకార్యక్రమంలో పాల్గొనండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రేమలు ఫలిస్తాయి. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన, ఆడిటింగ్‌, గార్మెంట్స్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

దూరంలో వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. రామచంద్రమూర్తిని ఆరాధించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-11-01T07:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising