ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-06-14T07:53:22+05:30

నేడు (14-6-2023 - బుధవారం) మిథున రావి వారు ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసొస్తుందట. ఇక కొన్ని రాశుల వారికి నేడు ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందట. మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు (14-6-2023 - బుధవారం) మిథున రావి వారు ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసొస్తుందట. ఇక కొన్ని రాశుల వారికి నేడు ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందట. మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంగారం, ఆభరణాలు, వడ్డీ వ్యాపారులకు అనుకూలం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. చొరవ, నైపుణ్యం, భిన్నమైన ఆలోచనలతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాaకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఉన్నత పదవులు అందుకుంటారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీసా, పాస్‌పోర్ట్‌ పనులకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. రవాణా, బోధన, పోలీస్‌, న్యాయ, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసం ఖ ర్చు చేస్తారు. షేర్‌మార్కెట్‌, మ్యూచ్యువల్‌ ఫండ్‌లో పెట్టుబడులకు అనుకూలం. పెన్షన్‌, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాయి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కేటరింగ్‌, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సిబ్బంది నియామకాలకు అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు చోటుచే సుకుంటాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్‌, సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రామాలయాన్ని దర్శించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. రవాణా, స్టేషనరీ, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-06-14T07:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising