Horoscope : రాశిఫలాలు
ABN, First Publish Date - 2023-07-14T08:05:52+05:30
నేడు (14-7-2023 - శుక్రవారం) సింహరాశి సహా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండలేదంటే అనుకోని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అవి పాటిస్తే కాస్త ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (14-7-2023 - శుక్రవారం) సింహరాశి సహా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండలేదంటే అనుకోని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అవి పాటిస్తే కాస్త ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారికి లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. విద్యార్థులు అధికంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. లలితా దేవి ఆరాధన మంచిది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బిల్లులు, చెక్కులు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చర్చలు ఫలించపోవచ్చు. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు ఇది తగిన సమయం కాదు. షాపింగ్‌లో నాణ్యతను గమనించడం అవసరం. వ్యక్తిగత సౌకర్యం లోపించడంతో ఇబ్బంది పడతారు. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఎగుమతులు, కన్సల్టెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, టెక్స్‌టైల్స్, కళల రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి, లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మాటపడాల్సి రావచ్చు. ఖర్చులు అంచనాలు మించుతాయి. గోసేవ, గోవుకు ఆహారం అందించడం వల్ల మేలు కలుగుతుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరుత్సాహం ఎదురవుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల నుంచి మాటపడాల్సి వస్తుంది. సమావేశాల్లో గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలు తప్పే అ వకాశం ఉంది. న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. చర్చలు, ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. రుణాల మంజూరులో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. బంధుమిత్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మరమ్మతులకు ఖర్చులు అధికం. కనకదుర్గామాత ఆరాధన చేయండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
షేర్‌మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితుల కోసం ఖ ర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. భాగస్వామి ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. కొత్త పరిచయాల వల్ల చిక్కులు ఎదురవుతాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. పరిశ్రలమలు, వ్యవసాయ రంగాల వారికి అనుకోని అ వాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆ రోగ్యం కలవరపెడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. కొత్త పరిచయాల వల్ల చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్ రంగాల వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ప్రియతముల వైఖరిలో మార్పుల బాధ కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - 2023-07-14T08:09:59+05:30 IST