ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-07-26T07:31:04+05:30

నేడు (26-8-2023 - బుధవారం) మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే వృషభ రాశివారికి సైతం ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సింహరాశివారికి కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడు (26-8-2023 - బుధవారం) మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే వృషభ రాశివారికి సైతం ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సింహరాశివారికి కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, మూచ్యువల్‌ ఫండ్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గ్రాట్యుటీ, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నష్టాలు తప్పకపోవచ్చు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. రామనామ పారాయణ చేయండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విందుల్లో పరిమితి పాటించాలి. ఇంటర్య్యూలలో నిరాశ తప్పకపోవచ్చు. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు. పనివారి కారణంగా అసౌకర్యానికి గురవుతారు. గణపతి ఆలయాన్ని దర్శించండి.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు లక్ష్య సాధనలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం వుంది. క్రీడలు, అడ్వర్టయిజ్‌ మెంట్‌ రంగాల వారు నిదానం పాటిచాలి. పొదపు పథకాలు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయండి. విష్ణుమూర్తి ఆరాధన మేలు చేస్తుంది.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కార్యాలయంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వసతి లోపిస్తుంది. రామాలయాన్ని దర్శించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలి. వాహనాల కారణంగా అసౌకర్యానికి గురవుతాయి. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమాధిక్యం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో కొంత సమయం గడపండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు అటంకాలు కలిగే అవకాశం వుంది. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆత్మావలోకనం చేసుకుంటారు. మనసును ఏదో వెలితి బాధిస్తుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురువుతాయి. కొత్తగా చేపట్టే పనుల ప్రారంభాన్ని వాయిదా వేయండి. అన్ని విషయాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. గణపతి ఆరాధన మంచిది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆలయాలు, హాస్టళ్లు సందర్శిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సేవా కార్యక్రమాలు తృప్తినిస్తాయి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్నేహానుబంఽధాలు బె డిసి కొట్టే ప్రమాదం వుంది. బ్యాంక్‌ డిపాజిట్లు, పొదుపు పథకాల వ్యవహారాలకు అనుకూల సమయం కాదు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని చికాకులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం వుంది. సంకల్ప సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు. పెద్దలను స్మరించుకుంటారు.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రక్షణ, రవాణా రంగాల వారు నిదానం పాటించాలి. న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం వుంది. సమావేశాలు, వ్యూహరచనలకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించలేకపోతారు. ఆలయంలో సేవా కార్యక్రమంలో పాల్గొనండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-07-26T07:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising