ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-10-18T08:57:01+05:30

నేడు (18-10-2023 - బుధవారం) మేషరాశి వారు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నేడు (18-10-2023 - బుధవారం) మేషరాశి వారు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. భాగస్వామి సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. రక్షణ, బోధన, రవాణా రంగాల వారికి కొత్త పరిచయాల వల్ల మేలు జరుగుతుంది.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఫైనాన్స్‌, బీమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుం ది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఫార్మా, వైద్య రంగాల వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. సహోద్యోగుల ఆం తరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మిం చిన వారు)

కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సమావేశాలు, వేడుకలు, ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. రామాలయాన్ని దర్శించండి.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. క్రీడలు, టెలివిజన్‌, విద్యా సం స్థలు, చిట్‌ఫండ్‌లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రి యల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రం గాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. కాం ట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో సోదరీ సోదరుల ప్రయాణాలకు ఏర్పాట్లు చే సుకుంటారు. మహావిష్ణువు ఆరాధన మేలుచేస్తుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధిం చిన సమాచారం సేకరిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థికపరమైన నిర్ణయాల్లో గత అనుభవం తోడ్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఎగుమతులు, సినిమాలు, రాజకీయ రం గాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెం బరు 21 మధ్య జన్మించిన వారు)

పదిమదిని కలుపుకొని మంచి పనికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూనియన్‌ కార్యకలాపాలు, వేడుకల్లో పాల్గొం టారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారు పెద్దల సహకారంతో అనుకున్న లక్ష ్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార ్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉం టుంది. రామాలయాన్ని దర్శించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, ఆర్థికపరమైన సమావేశాల్లో పాల్గొంటారు. బం దుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి లక్ష ్యాలు సాధిస్తారు. వ్యాపారరంగంలోని వారు అనుకూల ఫలితాలు అందుకుంటారు.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెన్షన్‌, గ్రాట్యుటీ, మెడికల్‌ క్లెయిములు పరిష్కారం అవుతాయి. అడ్వాన్సులు, రుణాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుం ది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పైఅధికారుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-10-18T10:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising