Tollywood Actress: కేబీఆర్ పార్క్‌లో నటిని వెంబడించి వేధించిన యువకుడు.. పోలీసుల విచారణ ఏం తేలిందంటే..
ABN, First Publish Date - 2023-03-02T10:50:24+05:30
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన యువ నటి షాలూ చౌరాసియా (Shalu chourasiya)ని ఓ యువకుడు వెంబడించి వేధించాడు.
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన యువ నటి షాలూ చౌరాసియా (Shalu chourasiya)ని ఓ యువకుడు వెంబడించి వేధించాడంటూ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ (KBR park)లో రాత్రి ఏడు గంటల సమయంలో షాలూ వాకింగ్ చేస్తుండగా.. ఓ గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. తను ఆగిన చోట ఆగుతూ.. నడిస్తే నడుస్తున్నాడని ఆమె గమనించింది. ఇలా పలుమార్లు చూసిన తర్వాత ఆ నటికి అనుమానం వచ్చి.. వెంటనే అక్కడ కొందరి వ్యక్తులు, పార్క్ సిబ్బందికి విషయం తెలియజేసింది. దీంతో అందరూ ఆ వ్యక్తిని పట్టుకుని కొండాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. వారి వివరాల ప్రకారం.. ఆ యువకుడి పేరు శేఖర్ అని చెప్పుకొచ్చాడు. అలాగే తను నటిని వెంబడించలేదని, తనూ వాకింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అతను నిజమే చెబుతున్నట్లు నిర్థారణ చేసుకుని, ఆ యువకుడిని వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, షాలూ చౌరాసియాకి రెండేళ్ల క్రితం ఇదే కేబీఆర్ పార్క్‌లో లైంగిక వేధింపులకి గురైంది. 2021 ఏడాదిలో ఓ రోజు సాయంత్రం వాకింగ్ వచ్చిన నటిని ఓ అగంతకుడు వెంటాడి, లైంగిక దాడికి ప్రయత్నించాడు. కుదరకపోవడంతో దాడి చేసి సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లాడు. మళ్లీ అలా జరగుతుందనే భయంతోనే ఆ వ్యక్తిపై నటి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. దీంతో నటికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్
Updated Date - 2023-03-02T11:04:20+05:30 IST