ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: 28 ఏళ్ల యువతిని పెళ్లాడిన తండ్రి, సపోర్టుగా నిలిచిన తాత.. ఇది తట్టుకోలేక ఆ ఇద్దరు యువకులు..

ABN, First Publish Date - 2023-10-21T17:59:44+05:30

తండ్రి మూడో వివాహం చేసుకోవడం ఆ ఇద్దరు యువకులకు అస్సలు నచ్చలేదు. దీని తోడు తాత కూడా తండ్రికి వంత పాడటంతో వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఓ రాత్రి వేళ తాత, తండ్రి, యువతిపై ఆ ఇద్దరూ యువకులు దారుణానికి ఒడిగట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: తండ్రి మూడో వివాహం చేసుకోవడం ఆ ఇద్దరు యువకులకు అస్సలు నచ్చలేదు. దీనికి తోడు తాత కూడా తండ్రికి వంత పాడటంతో వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఓ రాత్రి వేళ తాత, తండ్రి, యువతిపై దాడి చేశారు. ఈ ఘటనలో తాత, యువతి అక్కడికక్కడే మరణించగా తీవ్రగాయాల పాలైన తండ్రి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు(brothers kill stepmother, grandfather). ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) కాన్పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!


పూర్తి వివరాల్లోకి వెళితే, భోగ్నీపూర్ ప్రాంతానికి చెందిన విమల్ ద్వివేదీ(62) ఎయిడెడ్‌ ఇంటర్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు. అతడికి అప్పటికే రెండు సార్లు వివాహమైంది. మొదటి భార్యతో లలిత్ ద్వివేదీ(42) కలగగా రెండో భార్యతో అక్షత్ (20) కలిగాడు. అయితే, రిటైర్ అయిన తరువాత విమల్ ద్వివేదీ స్థానికంగా ఉండే ఖుష్బూ అవస్థీ అనే యువతికి దగ్గరయ్యాడు. ఇటీవలే ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు(Father marries third time). ఈ పెళ్లిని విమల్ తండ్రి రామ్ ప్రకాశ్ కూడా ఆమోదించాడు. దీంతో, విమల్ తన ఇద్దరు భార్యలు, కొడుకులతో కలిసి ఒకే కప్పు కింద నివసించసాగారు.

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..


అయితే, విమల్ మరో వివాహం చేసుకోవడం అతడి కుమారులు లలిత్, అక్షత్‌లకు అస్సలు నచ్చలేదు. పైపెచ్చు రిటైర్మెంట్ డబ్బులన్నీ ఖుష్బూ కోసం ఖర్చు చేస్తుండటం మరింత బాధించింది. ఈ క్రమంలో వారు ఇటీవల ఓ రోజు రాత్రి తండ్రి, తాత, సవితి తల్లిపై కత్తితో దాడి చేశారు. వారి చనిపోయారనుకుని తమ దారిన తాము వెళ్లిపోయారు. ఘటన సమయంలో విమల్ రెండో భార్య ఇంట్లో లేదు. కాగా, మరుసటి రోజు పొరుగున ఉన్న వ్యక్తి చూడగా ఆ ముగ్గురూ రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించగా విమల్ మినహా మిగతా ఇద్దరు మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైన విమల్‌ను కాన్పూర్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గురువారం నిందితులు రెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

NRI: రోడ్డు పక్కన విదేశీ మహిళ మృతదేహం.. సీసీటీవీ కెమెరాలు పరిశిలిస్తే వెలుగులోకొచ్చి దారుణం..

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

Updated Date - 2023-10-21T18:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising