ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన 4 ఏళ్ల పాప.. అటుగా వెళ్తున్న ఓ కాలేజీ యువతులకు డౌట్.. ఏమైందని అడిగితే..!

ABN, First Publish Date - 2023-11-23T22:29:14+05:30

తప్పిపోయిన బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కాలేజీ యువతుల ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఓ చిన్నారి రోడ్డు పక్కన దిక్కు తోచని స్థితిలో నిలబడిపోయింది. తల్లిదండ్రులు ఎక్కడున్నారో, ఎటు వెళ్లాలో తెలీక గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. మరోవైపు, అటుగా వెళుతున్న కొందరు కాలేజీ యువతులు ఆ చిన్నారిని చూశారు. మనకెందుకులే అని వెళ్లిపోకుండా ఆ యువతులు పోలీసుల సాయంతో బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు(College girls help baby unite with mother). ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) బదోన్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

High Court: నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. రద్దు చేయండంటూ హైకోర్టుకెళ్లిన కుర్రాడు.. చివరకు సంచలన తీర్పు..!

Mysterious Disease in China: కరోనా తర్వాత చైనాలో మరో కలకలం.. స్కూలు పిల్లలకు పాకుతున్న వింత వ్యాధి..!


జిల్లాలోని భమోరీ గ్రామానికి చెందిన గీత, తన భర్త, నాలుగేళ్ల కూతురితో కలిసి వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వివాహానికి హాజరైంది. ఆమె పెళ్లి వ్యవహారాల్లో బిజీగా ఉండగా ఆమె నాలుగేళ్ల కూతురు ఎటో వెళ్లిపోయింది. బిడ్డ కనిపించట్లేదన్న విషయాన్ని కాసేపటికి గుర్తించిన గీత తల్లడిల్లిపోయింది. మరోవైపు, ఆ చిన్నారి కుతూహలం కొద్దీ ఓ కూడలి వద్దకు వెళ్లి ఆ తరువాత ఏం చేయాలో తెలీక నిలబడిపోయింది. తల్లి కనిపించకపోవడంతో పెద్దపెట్టున ఏడవడం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ, అటుగా వెళుతున్న కాలేజీ యువతులు కొందరు ఆ చిన్నారిని చూశారు.

Homemade Washing Machine: వాషింగ్ మెషీన్ కొనడానికి డబ్బుల్లేక.. ఓ డ్రమ్ముతో ఎలా తయారు చేశాడో చూస్తే..!


బిడ్డను చూడగానే ఆమె తప్పిపోయిన విషయం వారికి అర్థమైంది. వెంటనే వారు చిన్నారిని ఎత్తుకుని ఊరడించే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకునేందుకు ట్రై చేశారు. కానీ పాప ఏ విషయమూ చెప్పలేకపోయింది. దీంతో, విద్యార్థినులు మరో ఆలోచన లేకుండా చిన్నారిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగింది పోలీసులకు చెప్పి, పాపను ఆడిస్తూ అక్కడే ఉండిపోయారు. తాము ఇళ్లకు వెళ్లాల్సిన విషయాన్నే మర్చిపోయారు. పోలీసులు కూడా బిడ్డ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్ని్స్తుండగా బిడ్డ తల్లిదండ్రులే కంగారుపడుతూ అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌లో సురక్షితంగా ఉన్న బిడ్డ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయారు. తమ బిడ్డను అక్కడున్న యువతులే కాపాడారని తెలిసి కన్నీటిపర్యంతం అవుతూ ధన్యవాదాలు తెలిపారు.

Viral: షాకింగ్ వీడియో! భర్త వద్ద బైక్ నేర్చుకుంటున్న మహిళ..అతడు వెనక నుంచి అరుస్తున్నా వినకుండా..

Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..

Updated Date - 2023-11-23T22:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising