ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంట్రోల్‌లో ఉండాలని ఇందుకే అనేది.. కుతూహలం ఎక్కువైన ఓ మహిళ ఎలాంటి చిక్కుల్లో పడిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-02-19T19:30:24+05:30

కుతూహలాన్ని అణుచుకోలేక ఇబ్బందుల్లో పడ్డ మహిళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనకంటికి కొన్ని వస్తువులు కొత్తగా, కాస్తంత వింతగా అనిపించొచ్చు. మనుషులన్నాక ఆ మాత్రం కుతూహలం ఉండటం సహజమే. అయితే.. ఉత్సుకతను అణుచుకోలేకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అమెరికాలో ఓ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల మియామీలో(Miami) ఆధునిక కళఖండాలతో ఓ ప్రదర్శన(Art Fair) ఏర్పాటు చేశారు. శునకాన్ని పోలి ఉండేలా గాజుతో తయారు చేసిన ఓ కళారూపాన్ని(Glass sculpture) ప్రదర్శించారు. అది ప్రముఖ ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్(Jeff Koons) రూపొందించిన కళాఖండం. ధర ఏకంగా 42 వేల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..దాదాపు రూ.37 లక్షలు. ఆ కళాఖండంపై జెఫ్ కూన్స్ పేరు కూడా ఉంది. ఓ స్టూల్‌పై పెట్టి దాన్ని ప్రదర్శించారు.

చూడటానికి ఆకర్షణీయంగా, బుడగతో తయారు చేసినట్టు ఉండటంతో ఓ మహిళ మదిలో కుతూహలం రేగింది. తన అనుమానం నిజమో కాదో తెలుసుకునేందుకు ఆమె దాన్ని కాస్తంత గట్టిగా తట్టింది. ఇంకేముందీ.. ఆ కళాఖండం ఒక్కసారిగా భళ్లుమని పగిలిపోయింది. గాజు ముక్కలన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి(Glass Sculpture broke). ఈ క్రమంలో సిబ్బంది నేలను శుభ్రం చేస్తుండగా.. అక్కడే ఉన్న మరో వ్యక్తి దాన్ని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో ఈ ఉదంతం ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ కళాఖండం విషయంలో ఎవరైనా అజాగ్రత్తగా ఉంటారా అంటూ ఓ మహిళ వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డైంది. కొందరేమో ఇదంతా స్టంట్ అనుకున్నారట. చివరకు నిజం తెలిసి అవాక్కయ్యారట.

అయితే..గాజు కళాఖండాన్ని స్పాన్సర్ చేసిన బెనెడిక్ట్ కలూచ్ ఈ ఉదంతంపై స్పందించారు. ఆ కళాఖండానికి ఇన్సూరెన్స్ చేయించడంతో నష్టం పరిహారం దక్కుతుందని చెప్పారు. దాన్ని పగలగొట్టాలన్న ఉద్దేశం ఆమెకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇక అమెరికాకు చెందిన కూన్స్.. ఆధునిక శిల్ప, చిత్రకళాకారుడిగా ప్రసిద్ధులు. కళాసంప్రదాయానికి భిన్నంగా ఆయన రూపొందించే కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని కళాఖండాలు ఏకంగా 91 మిలియన్ డాలర్లకు

Updated Date - 2023-02-19T19:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising