ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: వైద్య పరీక్షలకు వెళ్లిన వృద్ధుడు..ఆయన పెద్ద పేగులో ఏముందో చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగే షాక్!

ABN, First Publish Date - 2023-11-27T17:01:03+05:30

ఓ వృద్ధుడి పెద్ద పేగులో చెక్కుచెదరకుండా ఉన్న ఈగను చూసి షాకైన వైద్యులు.

ఇంటర్నెట్ డెస్క్: మానవ శరీరధర్మం గురించి అంతా తెలిసిన వైద్యులను ఆశ్చర్యపరిచే ఘటనలు అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. విషయం వారికీ అంతుచిక్కలేదంటే మ్యాటర్ సీరియస్‌గానే భావించాలి. అమెరికాలో(USA) ఇటీవల ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడిని పరీక్షిస్తున్న వైద్యులు అతడి పేగుల్లో ఏముందో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు అది ఎలా సాధ్యమైందో కూడా అర్థంకాక తలపట్టుకున్నారు. పరిస్థితి ఎంత అసాధారణమంటే ఈ వ్యవహారం ఏకంగా అమెరికన్ జర్నల్ ఆఫ్ గాస్ట్రో ఎంటిరాలజీలో (American Journal of Gastroenterology) ప్రచురితమైంది.

Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!

Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!


మిస్సోరీకి (Missouri) చెందిన ఓ వృద్ధుడు (63) వైద్యపరీక్షల నిమిత్తం ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు క్యాన్సర్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు వైద్యులు కొలొనోస్కోపీ నిర్వహించారు. తొలుత కొలాన్‌ను పరీక్షించాక పెద్ద పేగును పరిశీలిస్తుండగా ఓ ఆశ్చర్యకరం దృశ్యం కనిపించింది. పేగుల్లో ఓ ఈగ చెక్కుచెదరకుండా కనిపంచింది. దాన్ని కదిపినా కదలకపోవడంతో ఈగ చనిపోయిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా మనిషి కడుపు, పేగుల్లోకి చేరేది ఏదైనా సరే అక్కడ ఉండే ఎంజైముల కారణంగా గుర్తుపట్టలేనంతా అరిగిపోవాలి. కానీ ఈగ మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం(Intact fly in large intestine) వైద్యులను అమితంగా ఆశ్చర్య పరిచింది.

Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!


తాను తిన్న ఆహార పదార్థాల్లో ఈగ పడినట్టు గుర్తులేదని పెద్దాయన తేల్చి చెప్పారు. ఒకవేళ ఆయనకు తెలీకుండా ఈగను మింగేసినా కడుపు, పేగుల్లో ఉంటే ఎంజైములు ఈగను పూర్తిగా అరగదీసేయాలి. కానీ ఈగ చెక్కుచెదరకుండా ఉండటంతో అది రెక్టమ్ ద్వారా పేగుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అయితే, రెక్టమ్‌ నుంచి కొలాన్ గుండా పెద్ద పేగులోకి ఈగ వెళ్లడం ఎలా సాధ్యమో వారు కూడా చెప్పలేకపోయారు. దీంతో, పెద్ద మిస్టరీగా మారిన ఈ ఉదంతం తాలూకు వివరాలు మెడికల్ జర్నల్‌లో కూడా ప్రచురితమయ్యాయి.

Viral: భారతీయుడికి దిమ్మతిరిగే ఝలకిచ్చిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. నువ్వు సిగ్గుతో తలదించుకోవాలంటూ ఫైర్..

Viral: అసలైన లక్ అంటే ఇదే..ఒక్క తప్పుతో లైఫ్ టైం బంపర్ లాటరీ.. ఎంతొచ్చిందో తెలిస్తే..

Viral: వామ్మో ఇంత దూకుడా.. ఇలాగైతే చైనాను ఆపడం కష్టమే..!

Updated Date - 2023-11-27T17:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising