ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

USA: భార్యకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన రైతు.. 50వ పెళ్లి రోజు సందర్భంగా 12 లక్షలను పూలు..

ABN, First Publish Date - 2023-07-31T18:13:16+05:30

తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఓ అమెరికా రైతు తన భార్యకు ఎవ్వరూ ఊహించలేని గిఫ్ట్ ఇచ్చాడు. మొత్తం 80 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పువ్వులను పెంచి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. సన్‌ఫ్లవర్స్ అంటే ఇష్టపడే ఆమె భర్త బహుమతి చూసి తెగ మురిసిపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: భార్య లేదా ప్రియురాలికి నచ్చిన పువ్వు లేదా పూల బొకే ఇవ్వడం కామన్! కానీ మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. వాళ్లు పెళ్లి చేసుకుని 50 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఏదైనా కొత్త బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అలా పుట్టిన ఆలోచనకు కార్యరూపంలో ఇచ్చిన ఈ పెద్దయాన తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఏకంగా 12 లక్షల పూలను బహుమతిగా ఇచ్చాడు. కనుచూపు మేర అంతటా పూలు కనిపించడంతో ఆయన భార్య ఆనందానికి అంతేలేకుండా పోయింది. అసలేం జరిగిందో తెలియాలంటే మొత్తం కథ తెలుసుకోవాల్సిందే.

కాన్సస్ రాష్ట్రానికి(Kansas) చెందిన విల్సన్(US farmer) హైస్కూల్లో ఉండగానే తన సహవిద్యార్థిని రెనీతో ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత వారి పెళ్లి జరిగింది. ఇటీవలే వారు 50వ పెళ్లిరోజు జరుపుకున్నారు. అయితే, ఈ సందర్భంగా విల్సన్ భార్యకు ఏదైనా అద్భుతమైన గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు. రెనీకి పొద్దుతిరుగుడు పువ్వులంటే బోలెడంత ఇష్టమని ఆయనకు తెలుసు. దీంతో, ఆయనకు ఓ సరికొత్త ఐడియా తట్టడంతో మరో ఆలోచన లేకుండా దానికి కార్యరూపం ఇచ్చాడు.


ముందుగా తమ కొడుకుతో కలిసి తమ 80 ఎకరాల పొలంలో పొద్దుతిరుగుడు పువ్వుల పెంపకం చేపట్టాడు. వారి పెళ్లిరోజు వచ్చే సరికి మొత్తం 80 ఏకరాలూ పొద్దుడు తిరుగుడు పువ్వులతో నిండిపోయింది(1.2 million flowers in 80 acres). పొలంలో దాదాపు 12 లక్షల పూలతో కనుచూపుమేర అంతా పసుపు పచ్చదనం ఆవరించింది. అయితే, ఇదేదీ తన భార్యకు తెలీకుండా విల్సన్ జాగ్రత్త పడ్డాడు. ఇటీవల ఓ రోజు రెనీని అక్కడికి తీసుకెళ్లి చూపించడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.

మరోవైపు, ఈ వార్త అమెరికాకానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో మీడియా దృష్టి కూడా పడింది. అనేక ఛానళ్లు ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేశాయి. అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

Updated Date - 2023-07-31T18:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising