ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: డాక్టర్‌ చేతిరాత అర్థంకాక మెడికల్ షాపు సిబ్బంది ఘోర తప్పిదం.. మహిళ జీవితం తలకిందులు..

ABN, First Publish Date - 2023-10-09T18:47:05+05:30

డాక్టర్ చేతిరాత అర్థంకాక మెడికల్ షాపు సిబ్బంది చేసిన భారీ తప్పిదంతో ఓ గర్భిణి జీవితం తలకిందులైంది. వారి నిర్లక్ష్యం ఆమెకు తీరని దుఃఖం మిగిల్చింది. అమెరికాలోని లాస్ వేగస్ నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది.

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్ చేతిరాత అర్థంకాక మెడికల్ షాపు సిబ్బంది చేసిన భారీ తప్పిదంతో ఓ గర్భిణి జీవితం తలకిందులైంది. వారి నిర్లక్ష్యం ఆమెకు తీరని దుఃఖం మిగిల్చింది. అమెరికాలోని లాస్ వేగస్(LasVegas) నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానికంగా నివసించే ఓ వివాహితురాలికి అప్పటికే ముగ్గురు సంతానం. అయితే, ఆ భార్యాభర్తలు తమకు గంపెడు సంతానం ఉండాలని కోరిక. దీంతో, ఆమె కృత్రిమగర్భధారణ పద్ధతిలో మరోసారి తల్లి అయ్యేందుకు నిర్ణయించుకుంది.

Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ

చివరకు ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు కొన్ని మందులు సూచించారు. మందుల చీటీ పట్టుకుని మహిళ మెడికల్ షాపుకు వెళ్లగా వారు కొన్ని మందులు ఇచ్చారు. కానీ, అవి వాడాక ఆమెకు అబార్షన్ జరగడంతో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. మెడికల్ షాపు సిబ్బంది తనకు అబార్షన్ అయ్యే మందులు ఇవ్వడంతోనే ఇలా జరిగిందని గుర్తించిన ఆమె సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది(US Woman Mistakenly Given Abortion Pills Instead Of IVF Hormones).

Viral: లాటరీ టిక్కెట్ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్.. అన్నీ అమ్ముడుపోగా చివర్లో మిగిలిన ఒకే ఒక టిక్కెట్‌తో...


విచారణ సందర్భంగా మెడికల్ షాపు సిబ్బంది తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. తొలుత వారికి డాక్టర్ చేతిరాత అర్థంకాకపోవడంతో వారు తమకు అర్థమైనమేరకు ఓ మందు తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టారు. అంతేకాకుండా, ప్రామాణిక పద్ధతి ప్రకారం మందు వినియోగంపై ఆమెకు విరించాల్సిన వారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ నిబంధనలు తుంగలోతొక్కారు. దీంతో, మహిళ తనమానాన తాను ఆ ఔషధాలు వాడి చివరకు కడుపుపోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఈ కేసుకు సంబంధించి స్థానిక అధికారులు మెడికల్ షాపు సిబ్బందిపై ఇటీవల ఏకంగా 10 వేల డాలర్ల జరిమానా విధించారు. అంతేకాకుండా మహిళకు తప్పుడు మందులు ఇచ్చిన సిబ్బందికి కూడా జరిమానా విధించడంతో పాటూ వారిని ఏడాది పాటు ప్రొబేషన్‌పై పంపించారు. మరోవైపు, మెడికల్ షాపు వారు కూడా బాధితురాలికి క్షమాపణలు చెప్పారు.

ఘటన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా నాటి గాయాలు మానలేదని మహిళ వాపోయింది. తనకు ఇంతటి నష్టం జరిగినా ఓ ’సారీ‘ మినహా తనకు ఎటువంటి పరిహారం దక్కలేదని విచారం వ్యక్తం చేసింది.

Viral: లాటరీ టిక్కెట్ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్.. అన్నీ అమ్ముడుపోగా చివర్లో మిగిలిన ఒకే ఒక టిక్కెట్‌తో...

Updated Date - 2023-10-09T18:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising