ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. 2021లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే..

ABN, First Publish Date - 2023-01-02T15:36:18+05:30

మద్యం సేవించి వాహనం నడపడం ఎంతో ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాటిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఎక్కువ. కొన్నేళ్లుగా ఆ జాబితాలోకి మరో కారణం కూడా చేరింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఉపయోగించడం కూడా అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం సేవించి వాహనం నడపడం ఎంతో ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాటిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఎక్కువ. కొన్నేళ్లుగా ఆ జాబితాలోకి మరో కారణం కూడా చేరింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ (Mobile phone while Driving) ఉపయోగించడం కూడా అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు (Road Accidents) కారణమవుతోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నివేదిక ప్రకారం, మొబైల్ వాడుతూ డ్రైవ్ చేయడం కారణంగా 2021 సంవత్సరంలో మొత్తం 1,997 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 1,040 మంది ప్రాణాలు కోల్పోయారు.

`భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు- 2021' (Road accidents in India- 2021) పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం సిగ్నల్ జంప్ చేయడం వల్ల 555 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందువల్ల 222 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 2021లో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల కారణంగా 1,53,972 మంది ప్రాణాలు కోల్పోగా, 3,84,448 మంది గాయపడ్డారు. ఇక, రోడ్లు బాగా లేకపోవడం, గుంతల కారణంగా 2021లో 1481 మంది చనిపోయినట్టు నివేదిక పేర్కొంది.

Updated Date - 2023-01-02T15:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising