Shocking: మిల్క్‌షేక్‌ను ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఆ కప్పు నిండా ఏం నింపి పంపారో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-11-02T22:00:45+05:30
ఆన్‌లైన్‌లో మిల్క్ షేక్ ఆర్డరిచ్చిన ఓ అమెరికా వ్యక్తికి ఇటీవల దారుణ అనుభవం ఎదురైంది. స్ట్రాతో ఒక్క సిప్ తాగగానే తాను ఏం రుచి చూశాడో తెలిసి అతడికి కంపరం పుట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో మిల్క్ షేక్ ఆర్డరిచ్చిన ఓ అమెరికా వ్యక్తికి ఇటీవల దారుణ అనుభవం ఎదురైంది. స్ట్రాతో ఒక్క సిప్ తాగగానే తాను ఏం రుచి చూశాడో తెలిసి అతడికి కంపరం పుట్టింది. తనకు మిల్క్ షేక్ డెలివరీ చేసిన వ్యక్తిని వెనక్కు పిలిపించుకుని నిలదీయగా అతడు జరిగిన పొరపాటు గురించి అంగీకరించాడు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
యూటాకు చెందిన కేలబ్ వుడ్స్ ఇటీవల గ్రబ్‌హబ్ డెలివరీ యాప్ ద్వారా చిక్ ఫిల్ ఏ రెస్టారెంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డరిచ్చాడు. ఆ తరువాత కాసేపటికి డెలివరీ బాయ్ కేలబ్ ఆర్డరిచ్చిన ఆహారాన్ని డెలివరీ చేశాడు. ఆ తరువాత మిల్క్ షేక్ గ్లాసులో స్ట్రా వేసుకుని ఒక సిప్ పీల్చగానే కేలబ్‌కు కంపరం పుట్టింది. తానేమి టేస్ట్ చేసింది మూత్రమని తెలిసి ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది(Utah man orders milkshake but gets a cup full of urine). అతడికి కోపం కట్టలు తెంచుకోవడంతో అతడు డెలివరీ బాయ్‌కు ఫోన్ చేసి తన ఇంటికి రప్పించాడు.
డెలివరీ బాయ్ ఇంటికి రాగానే అతడికి జరిగింది చెప్పి నిలదీశాడు. కేలబ్ కోపం చూసి భయపడిపోయిన డెలివరీ బాయ్ జరిగిన పొరపాటు గురించి చెప్పేశాడు. నిత్యం కారులో సామాన్లు డెలివరీ చేస్తుంటానని అతడు చెప్పాడు. కొన్ని సందర్భాట్టో టైం దొరక్క కారులోనే ఓ బాటిల్‌లో మూత్ర విసర్జన్ చేశానని తెలిపాడు. ఈ క్రమంలో కేలబ్‌కు డెలివరీ చేసే సమయంలో పొరపాటు ఒక గ్లాస్ బదులు మూత్రం ఉన్న మరో గ్లాస్ ఇచ్చానంటూ జరిగిన తప్పును అంగీకరించాడు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన కేలబ్ చివరకు గ్రబ్‌హబ్‌కు ఫిర్యాదు చేశాడు.
కేలబ్ ఫిర్యాదు చేసిన నాలుగు రోజులకు తీరిగ్గా స్పందించిన కంపెనీ అతడి డబ్బును రిఫండ్ చేసింది. అతడికి క్షమాపణలు కూడా చెప్పింది కానీ డెలివరీ చార్జీలను మాత్రం తిరిగి చెల్లించలేదు. అయితే, సదరు డెలివరీ బాయ్‌తో తమ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు మాత్రం వెల్లడించింది.
Updated Date - 2023-11-02T22:00:48+05:30 IST