ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rose Color Meanings: రంగురంగుకో మీనింగ్..గులాబీల రంగును బట్టి ఫీలింగ్స్ తెలుస్తాయట..!

ABN, First Publish Date - 2023-02-07T12:51:26+05:30

ఎరుపు గులాబీలు లోతైన ప్రేమను సూచిస్తాయి, పసుపు గులాబీలు స్నేహాన్ని సూచిస్తాయి.

Rose Color Meanings
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ, స్నేహం నుండి అభిరుచి వరకు, ప్రతి భావాన్నీ గులాబీ పువ్వురంగుతో చెప్పవచ్చట. ప్రతి గులాబీ రంగుకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. గులాబీలు ఎరుపు, పసుపు, తెలుపు ఇలా రంగురంగులతో మనసులోని భావాలను పంచుకోవచ్చు. అందమైన పువ్వుల సాయంతో సహజంగా, మీ భావాన్ని తెలియజేయాలంటే ఏ పువ్వును ఎంచుకోవాలి? వాలెంటైన్స్ డే కోసం రోజ్ కలర్ ను ఎంచుకోవాలంటే ప్రేమ, అభిమానం నుండి స్నేహం వరకూ..

గులాబీలు ప్రేమకు పరిపూర్ణ స్వరూపం, కానీ వాటి రంగులు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి, వాలెంటైన్ కోసం సరైన గులాబీతో మనసులో భావాన్ని ప్రియమైన వారికి తెలియజేయండిలా..,

(Red roses) ఎరుపు గులాబీలు: ప్రేమ, ప్రశంసలు

వాలెంటైన్స్ డే, ట్రేడ్‌మార్క్ గులాబీ రంగు ఇది ప్రేమకు చిహ్నం, అభిమానాన్ని సూచిస్తుంది. ఎర్ర గులాబీలు వాలెంటైన్స్ డే రోజున ప్రేమ భావాలను పూయిస్తాయి. ప్రేమికుల రోజున గులాబీలు ముఖ్యంగా రెండు మనసుల ప్రేమను కలపడంలో భాగమైపోతాయి.

(Yellow roses) పసుపు గులాబీలు: స్నేహం

ప్రకాశవంతమైన ఉల్లాసమైన రంగు పసుపు, గులాబీ రంగు అర్థాల విషయానికి వస్తే పసుపు సంతోషకరమైన రంగులలో ఒకటి. వెలెంటైన్స్ డేని జరుపుకోవడానికి పసుపు గులాబీలు ప్రత్యేకమైనవి కాకపోయినా.. వీటితో గొప్ప స్నేహితుడిని పొందవచ్చు.

(Lavender roses)లావెండర్ గులాబీలు: ప్రత్యేకమైన ప్రేమ

లావెండర్ అనేది పింక్ లేదా ఎరుపు కంటే తక్కువ సాధారణ రంగు, ఇది మీ ప్రేమను వ్యక్తీకరించడానికి సరైనది. సున్నితమైన , అరుదైనదిగా చెపుతారు. ఎదుటివారిపై మీకున్న అపారమైన ప్రేమను వ్యక్తీకరించడం వంటి సున్నితమైన భావాలను తెలిపేందుకు ఈ లావెండర్ గులాబీలు సహాయపడతాయి.

(Deep pink roses) గులాబీలు: కృతజ్ఞత

ఈ గులాబీల విషయానికి వస్తే, అన్ని షేడ్స్ ఉమ్మడిగా ఉంటాయి, అవి కృతజ్ఞత, దయ, ఆనందాన్ని సూచిస్తాయి. అవి ఎరుపు కంటే చాలా సున్నితమైనవి. ఉదాహరణకు, ఎరుపు రంగు ఉద్వేగభరితమైన ప్రేమను సూచిస్తున్నప్పటికీ, ప్రేమను, కృతజ్ఞతను తెలిపేందుకు ఏ గులాబీని ఎంచుకోవాలి అనే విషయంలో, పంచుకున్న బంధానికి కృతజ్ఞతలు తెలపాలనుకున్నప్పుడు, మీ బెస్ట్ ఫ్రెండ్‌కి చెప్పాలనుకున్నప్పుడు, ఈ గులాబీలు అద్భుతమైన ఎంపిక, ఇవి ఆనందం, కృతజ్ఞతను సూచిస్తాయి.

(Medium pink roses) గులాబీలు: కృతజ్ఞత, దుఃఖం, అభినందనలు

మీడియం పింక్ చాలా బహుముఖంగా ఉంటుంది, ఈ గులాబీలు అనేక రకాల సందర్భాలలో సరిగ్గా సరిపోతాయి. దుఃఖంలో ఉన్నవారికి ఇవ్వడానికి ఈ పూలు సరిపోతాయి. అలాగే అభినందనలు చెప్పడానికి, మొదటి ప్రేమను పంచుకోవడానికి కూడా ఈ గులాబీలు సరిపోతాయి.

(Light pink roses) లేత గులాబీలు: అమాయకత్వం, ప్రశంసలు

తెలుపు గులాబీలకు ప్రత్యామ్నాయంగా లేత గులాబీలు వాడచ్చు. అవి అమాయకత్వాన్ని సూచిస్తాయి వీటితో ప్రశంసల సందేశాన్ని కూడా పంపచ్చు,. ఈ అందమైన రేకుల గులాబీలతో అమ్మ, సోదరి, స్నేహితుడికి కూడా గొప్ప బహుమతిగా అందించవచ్చు.

(White roses) తెల్ల గులాబీలు: అమాయకత్వం, కొత్త ప్రేమ

చారిత్రాత్మకంగా, గులాబీ రంగు అర్థం పరంగా, తెలుపు కన్యత్వం,అమాయకత్వాన్ని సూచిస్తుంది. వివాహాలు శుభకార్యాలలో కూడా తెలుపును వాడతారు. శాంతిని అందించడంలో కానీ ఈ తెల్లని గులాబీలు వాడతారు. అలాగే మీరు పెళ్లికి సిద్ధంగా లేకపోయినా, ఈ గులాబీని వాడచ్చు.

(Purple roses) పర్పుల్ గులాబీలు: అభిరుచి, వ్యామోహం

ప్రేమలో పొందే లవ్‌స్ట్రక్ ఫీలింగ్ మీకు తెలుసా? లోతైన ఊదా గులాబీలతో ఈ ఫీలింగ్ ను పంచుకోవచ్చు. పర్పుల్ గులాబీలు సుదీర్ఘమైన, ప్రేమతో కూడిన శాశ్వతమైన ప్రేమ భావాలను తెలియపరుస్తుంది.

(Orange roses) నారింజ గులాబీలు: ఆకర్షణ

ఎరుపు గులాబీలు లోతైన ప్రేమను సూచిస్తాయి, పసుపు గులాబీలు స్నేహాన్ని సూచిస్తాయి. అయితే ఈ నారింజ ఈ రెండింటి కలయిక కాబట్టి, వాటి మధ్య వారధిగా భావించండి,అభిరుచి, శక్తి, ఆకర్షణకు సూచిక ఈ నారింజ రంగు గులాబీలు., ఈ పువ్వులు స్నేహాన్ని, ఆకర్షణను అన్ని భావాలను పంచుకునేందుకు వాడవచ్చు.

(Salmon roses) సాల్మన్ గులాబీలు: కోరిక, ఉత్సాహం

సాల్మన్ అందమైన రంగుతో ప్రేమ అనుభూతినే కాదు.. ఎదుటివారిపై మీకున్న ఫీలింగ్స్ ని చెప్పేందుకు ఈ కలర్ ని ఎంచుకుంటే చాలు మాటలు చెప్పే ధైర్యం కూడా చేయక్కరలేకుండానే మనసులో ఫీలింగ్ ని అర్థం చేసుకుంటారు.

(Peach roses) పీచ్ గులాబీలు: ధన్యవాదాలు, కృతజ్ఞతలు

ఈ రంగు కృతజ్ఞతలు తెలియజేయడానికి,కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి వాడతారు. ఈ పువ్వు మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి సరిగ్గా సరిపోతుంది. ఈ పువ్వులు స్నేహితుడు, కుటుంభ్యుల పట్ల సానుభూతిని చూపించడానికి కూడా వాడతారు.

(Cream roses) క్రీమ్ గులాబీలు: ఆకర్షణ, ఆలోచనాత్మకత

తెలుపు తరచుగా అమాయకత్వం భావనను తెలిపే రంగుగా పరిగణించబడుతున్నప్పటికీ, క్రీమ్, సూక్ష్మమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. క్రీమ్ గులాబీలు మనోజ్ఞతను,ఆలోచనాత్మకతను సూచిస్తాయి. ఇష్టమైన వారు మీ మనస్సులో ఉన్నారని ఎవరికైనా చెప్పడానికి సరైన మార్గం.

(Burgundy roses) గులాబీలు: భక్తి

ఎరుపు లాగా, ఈ గులాబీలు భక్తిని తెలుపుతాయి. ఈ అద్భుతమైన, ముదురు ఎరుపు గులాబీల వెనుక ఉన్న ఆధునిక అర్థం అపస్మారక సౌందర్యం. అయితే, చారిత్రాత్మకంగా విక్టోరియన్ శకంలో, ఈ ముదురు గులాబీలతో అందగత్తెలు లోతైన ప్రేమను, భక్తిని వ్యక్తం చేసేవారు. సాంప్రదాయ ఎరుపు స్థానంలో ఈ గులాబీలు వాడేవారట.. ప్రేమికుల రోజుకి మన్మథుడు భక్తిగా సమర్పించేవారేమో..

(Green roses) ఆకుపచ్చ గులాబీలు: శుభవార్త, కొత్త ప్రారంభం

చాలా మంది ఆకుపచ్చ గులాబీలు రంగులు అద్దినవేమో అనుకుంటారు. 1743లో పచ్చని గులాబీలు సహజంగా పూయిస్తున్నారు. జీవితం పునరుజ్జీవనం, ఆకుపచ్చ గులాబీలు శుభవార్తకు కొత్త ప్రారంభాలకు, అద్భుతమైన వేడుకలకు మంచి ఎంపిక..ఈ రోజ్ డేని లవర్స్ మాత్రమే కాదు.. ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇచ్చే వ్యక్తి.. మనసులోని భావాన్ని తనకు నచ్చిన విధంగా ఇలా నప్పే పువ్వును పుచ్చుకుని ఆ వ్యక్తుల ఆయా రంగుల రోజా పూలతో తెలియజేయచ్చు.

Updated Date - 2023-02-07T12:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising