Varun Tej: వరుణ్ తేజ్‌తో రొమాన్స్ చేస్తున్న మాజీ మిస్ యూనివర్స్
ABN, First Publish Date - 2023-03-03T17:43:16+05:30
మెగా కుటుంబంలోనే పొడగరి హీరో వరుణ్ తేజ్ (Varun Tej). ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్‌గా ‘వీటీ13’ అని వ్యవహరిస్తున్నారు.
మెగా కుటుంబంలోనే పొడగరి హీరో వరుణ్ తేజ్ (Varun Tej). ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్‌గా ‘వీటీ13’ అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్రను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘విటి13’ లో మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించనున్నారు. రాడర్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మానుషి చిల్లర్ 2017లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj)తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. అయినప్పటికి, ఆమె నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫలితంగా మానుషి వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ‘విటి13’ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఒకేసారి తెలుగు, హిందీలో మూవీని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనెసాన్స్ పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ కలసి నిర్మిస్తున్నాయి.
వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) తో ఓ సినిమా చేస్తున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి నాగబాబు సమర్పిస్తున్నారు. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఓ మూవీలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు
Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!
Updated Date - 2023-03-03T17:43:16+05:30 IST