Veera Simha Reddy OTT Streaming: అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..

ABN, First Publish Date - 2023-02-12T13:42:46+05:30

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన తాజా చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). ‘క్రాక్’ ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన..

Veera Simha Reddy OTT Streaming: అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..
Veera Simha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన తాజా చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). ‘క్రాక్’ ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruthi Hasaan) హీరోయిన్‌గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

balayya.jpg

ఈ మూవీ విడుదలై నెటికి నెల రోజులు పూర్తి అయ్యింది. దీంతో ఈ మూవీ ఓటీటీ (OTT) విడుదలకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతలకి భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాని ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. హాట్‌స్టార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘‘సీమ సింహం వేట షురూ. ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుంచి ‘వీర సింహారెడ్డి’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రెడీ నా?’ అని రాసుకొచ్చింది. దీంతో రెడీ అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hunt OTT streaming: ఓటీటీలోకి వచ్చేసిన ‘హంట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Updated Date - 2023-02-12T13:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising