ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత

ABN, First Publish Date - 2023-02-19T09:46:58+05:30

ప్రముఖ తమిళ హాస్య నటుడు ఆర్. మయిల్‌సామీ (Mayilsamy) ఆదివారం తెల్లవారుజామున (ఫిబ్రవరి 19న) మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ తమిళ హాస్య నటుడు ఆర్. మయిల్‌సామీ (Mayilsamy) ఆదివారం తెల్లవారుజామున (ఫిబ్రవరి 19న) మరణించారు. ఈ హాస్య నటుడు 57 వయస్సులో అనారోగ్యం కారణంగా మరణించారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా (Ramesh Bala) కూడా మరణాన్ని ధృవీకరించారు. ఈ నటుడు అనుకోకుండా అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపే మయిల్‌సామీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మయిల్ సామీ చివరి సారిగా ‘గ్లాస్‌మేట్స్’ అనే సినిమాకి డబ్బింగ్ చెబుతున్న వీడియోని షేర్ చేసిన ఈ విషయాన్ని తెలిపారు.

రమేష్ బాలా చేసిన ట్వీట్‌లో.. ‘దివంగత నటుడు మయిల్‌సామీ చివరి వీడియో ఇది.. ఆయన అసౌకర్యానికి గురయ్యారు.. ఆయన కుటుంబసభ్యులు మయిల్‌సామీని పోరూర్ రామచంద్రా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో మరణించిన విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఆయన ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.. RIP!’ అని రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి : Udhayanidhi Stalin: సాఫ్ట్ టైటిల్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

కాగా.. తన 39 ఏళ్ల కెరీర్‌లో మయిల్‌సామీ 200కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఆసాధారణ కామెడీ టైమింగ్ తమిళ పరిశ్రమలో ఆయనకి ‘సీన్ స్టీలర్’ (scene stealer) అనే బిరుదుని సంపాదించి పెట్టింది. ఎందుకంటే ఆయన ఏ సన్నివేశంలో నటించిన అందరి దృష్టిని ఆయన వైపే లాగేసుకుంటారు. కాగా.. మయిల్‌సామీ మరణ వార్త తెలిసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-19T09:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising