ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vignesh Shivan: అజిత్ సినిమాకు దర్శకత్వం వహించట్లేదా..?

ABN, First Publish Date - 2023-02-04T17:01:44+05:30

విభిన్న సినిమాలను తెరకెక్కించి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). ‘నేనూ రౌడీనే’, ‘గ్యాంగ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందడంతో స్టార్ హీరో అజిత్ (Ajith), విఘ్నేశ్‌కు అవకాశమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలను తెరకెక్కించి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). ‘నేనూ రౌడీనే’, ‘గ్యాంగ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందడంతో స్టార్ హీరో అజిత్ (Ajith), విఘ్నేశ్‌కు అవకాశమిచ్చారు. ఈ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్స్ నిర్మించాలి. వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే 62’ (AK 62) అని పెట్టారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించడం లేదని కోలీవుడ్ మీడియాలో కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆ వదంతులే నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. విఘ్నేశ్ చేసిన ఓ పని అందుకు బలాన్ని చేకూరుస్తుంది.

విఘ్నేశ్ శివన్ స్క్రిప్ట్‌తో అజిత్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమాను చేయకూడదని స్టార్ హీరో నిర్ణయించుకున్నాడని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మగిజ్ తిరుమనేని (Magizh Thirumeni) అనే డైరెక్టర్ చెప్పిన కథకు అజిత్ ఫిదా అయ్యాడట. ఫలితంగా మగిజ్‌కే అవకాశమిచ్చినట్టు సమాచారం. విఘ్నేశ్ శివన్ కూడా తన ట్విట్టర్ బయో నుంచి ‘ఏకే 62’ ను తొలగించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించట్లేదని హింటిచ్చారు. అయినప్పటికి, అజిత్ 63వ మూవీకి మాత్రం విఘ్నేశ్ శివనే దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అజిత్ కోసం ఆయన మరో స్క్రిఫ్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. విఘ్నేశ్ శివన్ చివరగా ‘కాతు వక్కుల రెండు కాదల్’ కు దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో, హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

Updated Date - 2023-02-04T17:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising