ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijay Deverakonda: గూఢచారిగా విజయ్ దేవరకొండ

ABN, First Publish Date - 2023-01-13T19:36:45+05:30

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవర కొండ (Vijay Deverakonda). ‘రౌడీ’ హీరో నటిస్తున్న సినిమా ‘ఖుషి’ (Kushi) షూటింగ్ కొంత కాలంగా ఆగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవర కొండ (Vijay Deverakonda). ‘రౌడీ’ హీరో నటిస్తున్న సినిమా ‘ఖుషి’ (Kushi) షూటింగ్ కొంత కాలంగా ఆగిపోయింది. సమంత అనారోగ్యంతో బాధపడుతుంటంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఫలితంగా విజయ్ కొత్త సినిమాను ఒకే చేసే పనిలో పడ్డాడు. దర్శకుల నుంచి వరుసగా కథలు వింటున్నాడు. యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) తో ఓ మూవీని చేయనున్నాడని కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రూమర్సే నిజమయ్యాయి.

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కలసి సినిమా చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలసి నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు. .ఎవరికీ ద్రోహాం చేశానో చెప్పలేను’’ అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. ఓ కాన్సెఫ్ట్ పోస్ట్‌ర్‌ను అభిమానులతో పంచుకుంది. సముద్రతీరంలో యుద్ధ సన్నివేశంతో మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్‌ను ఆసక్తిగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గూఢచారిగా కనిపించనున్నాడు. ప్రాజెక్టు అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. చిత్రంలో నటించే వారి వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడిస్తారు.

Updated Date - 2023-01-13T19:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising