ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varasudu OTT Streaming: అధికారికంగా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించిన ఓటీటీ.. ఎప్పుడు, ఎక్కడంటే..

ABN, First Publish Date - 2023-02-17T14:58:42+05:30

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy) కాంబో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu). తమిళంలో ‘వారిసు’ (Varisu)..

Vaarasudu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy) కాంబో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu). తమిళంలో ‘వారిసు’ (Varisu). తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషించారు. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుక వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లను సాధించింది. త్వరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.

‘వారసుడు’ ఓటీటీ రైట్స్‌ని ఇంతకుముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ని ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఈ ఓటీటీ యాజమాన్యం షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘ఇక సిద్ధంగా ఉండండి.. ఎదురు చూపులు ముగిశాయి. అతను ఇక్కడికి రాబోతున్నాడు. ఫిబ్రవరి 22న ‘వారిసు/వారుసుడు’ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో వచ్చేస్తోంది’ అని రాసుకొచ్చింది. దీంతో విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Veera Simha Reddy: అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..

Updated Date - 2023-02-17T14:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising