Viral News: నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లీ.. బస్సులో ఒక్కతే ఉండటంతో డ్రైవర్, కండక్టర్ పిచ్చి చేష్టలు.. సీట్లో కూర్చునే వాళ్ల ఆట కట్టించింది..!
ABN, First Publish Date - 2023-04-10T20:15:32+05:30
అమ్మాయి బస్సులో ఒంటరిగా ఉండటంతో బస్సు డ్రైవర్, కండక్టర్ రెచ్చిపోయారు. ఆ అమ్మాయిని తమ చేష్టలతో వేధించడం మొదలుపెట్టారు. అయితే ఆ అమ్మాయి భయపడిపోకుండా తను కూర్చున్న సీటు నుండి లేవకుండానే
ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. అమ్మాయిలు ఒంటరిగా ఈ సమాజంలో తిరగాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కొన్నిసార్లు తోటి ప్రయాణికుల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మరికొన్నిసార్లు అమ్మాయిలకు ధైర్యం చెప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లే అమ్మాయిలను వేధిస్తుంటారు. ఓ అమ్మాయి బస్సులో ఒంటరిగా ఉండటంతో బస్సు డ్రైవర్, కండక్టర్ రెచ్చిపోయారు. ఆ అమ్మాయిని తమ చేష్టలతో వేధించడం మొదలుపెట్టారు. అయితే ఆ అమ్మాయి భయపడిపోకుండా తను కూర్చున్న సీటు నుండి లేవకుండానే వారిద్దరి ఆట కట్టించింది. ఈ అమ్మాయి గురించి విన్న నెటిజన్లు 'నువ్వు సూపర్ తల్లీ.. ప్రతి ఆడపిల్లా నీలా ధైర్యంగా ఉండాలి' అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వూర్తీ వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం బేవార్(Beware) జిల్లాలో శారదానా ప్రాంతంలో శీతల్ ప్రజాపత్ అనే మహిళ నివసిస్తోంది.ఈమె సామాజిక కార్యకర్త. ఈమె కుటుంబం రాజస్థాన్ లోనే ఉన్న పాలి(pali) జిల్లా సెండాలో నివసిస్తోంది. దీంతో శీతల్ బేవార్ నుండి సెండాలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు ప్రయాణమయ్యింది. బేవార్ నుండి సెండాకు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకుంది. ఆ బస్సు సెండా బస్టాప్ వైపు వెళ్ళకుండా నేరుగా హైవేపైకి వెళ్ళింది. బస్సు డ్రైవర్(bus driver) ప్రయాణికులను అక్కడే దిగిపొమ్మన్నాడు. ఇక చేసేది లేక ప్రయాణికులు తిట్టుకుంటూనే అక్కడ దిగిపోయారు. శీతల్ మాత్రం బస్సు దిగలేదు. ఆమె డ్రైవర్ తో తనను సెండా బస్టాప్ లో దింపమని కోరింది. కానీ బస్ డ్రైవర్ శీతల్ ను సెండా బస్టాప్ లో దింపకుండా బస్ ను నడపుతూనే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇలా ఆటపట్టిస్తే బావుంటుందని ఆ డ్రైవర్, కండక్టర్(driver, conductor) ఇద్దరూ కుమ్మక్కై ఆమెను భయపెట్టాలని చూశారు.
Viral Video: అమ్మా.. పెళ్లికూతురా..? విడాకులు ఎప్పుడో కూడా చెప్పెయ్.. అంటూ నెటిజన్ల సెటైర్లు.. ఇంతకీ వధువు చేసిన పనేంటంటే..
వారు చేస్తున్న పనికి శీతల్ భయపడిపోకుండా తెలివిగా ఆలోచించింది. ఆమె తన మొబైల్ నుండి సెండాలో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ కలిపింది(call connect to family members). ఆ తరువాత కండక్టర్, డ్రైవర్ లతో గొడవకు దిగింది. 'నేను దిగాల్సిన స్టాప్ లో నన్ను దింపకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు? బస్సులో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఇలా వేధిస్తారా? ఆడపిల్లకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?' అంటూ శీతల్ కండక్టర్ , డ్రైవర్ ముందు మాటల యుద్దం చేసింది. ఆమె మాట్లాడుతున్న మాటలన్నీ అవతల ఆమె కుటుంబ సభ్యులకు వినబడ్డాయి. తమ ఆడబిడ్డ సమస్యలో ఉందని వారికి అర్థమైంది. శీతల్ తెలివిగా ఆ బస్సు ప్రయాణిస్తున్న రూట్ కూడా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులను(villagers) వెంటబెట్టుకుని బస్సును పట్టుకున్నారు. శీతల్ బస్సునుండి దిగగానే గ్రామస్తులందరూ ఆ బస్సును కండక్టర్, డ్రైవర్ తో సహా పోలిస్ స్టేషన్(Police station) కు తీసుకెళ్ళారు. శీతల్ పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పి ఫిర్యాదు చేసింది. పోలీసులు డ్రైవర్ ను, కండక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నువ్వు సూపర్ తల్లీ నీ ధైర్యానికి హ్యాట్సాఫ్..' అంటున్నాకు నెటిజన్లు. అమ్మాయిలు శీతల్ లా సమయస్పూర్తి ప్రదర్శిస్తే ప్రమాదాల నుండి బయటపడవచ్చని అంటున్నారు.
White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!
Updated Date - 2023-04-10T20:15:32+05:30 IST