ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న జంతువును 5సెకెన్లలో కనిపెట్టండి చూద్దాం.. మీ బుర్ర ఎంత షార్పో మీరే తేల్చుకోండి..

ABN, First Publish Date - 2023-03-09T14:16:02+05:30

మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి.. మీరు కనుక 5సెకెన్ల ఫోటోలో ఉన్నదేెంటో కనిపెట్టారంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూస్ పేపర్స్ లోనూ.. ఆదివారం సంచికల్లోనూ చెప్పుకోండి చూద్దామని, కనిపెట్టండి చూద్దామని ఫోటోలు, పదచదరంగాలు ఇచ్చి మన మెదడుకు మేత పెట్టేవారు. చాలామంది వీటిని సరదాగా పూర్తి చేసి తమ బ్రెయిన్ పదును పెట్టుకునేవారు. అయితే డిజిటల్ మీడియా వేగవంతమయ్యాక పుస్తకాలు, న్యూస్ పేపర్లు టచ్ చేయడం తగ్గించేశారు. కానీ డిజిటల్ మీడియాలోనూ ఇలాంటి బుర్రకు పదున పెట్టే టెస్ట్ లు ఉంటున్నాయి. అలాంటిదే ఇది కూడా..

కొన్ని సార్లు మనకళ్ళు మనల్ని మోసం చేస్తాయి. దీన్ని ఆప్టికల్ ఇల్యూషన్ అని ఇంగ్లీష్ లోనూ,దృష్టి భ్రాంతి అని తెలుగులోనూ అంటారు. ఫోటోలో ఉన్న ప్రాంతంలో ఒక జంతువు కలిసిపోయి ఉంది. బ్యాక్ గ్రౌండ్ ప్రాంతం ఉన్న రంగులోనే ఆ జంతువు కూడా ఉండటంతో కళ్ళకు, బుర్రకు కాస్త పని పెట్టాల్సి వస్తోంది. ఫొటో వైపు చూస్తూ ఏమాత్రం కళ్ళు పక్కకు తిప్పినా అందులో ఉన్న జంతువును కనుక్కోవడం కష్టమైపోతుంది. దీనికోసం ఏకాగ్రత చాలా అవసరం. కొందరు ఫోటోలో ఉన్న జంతువును తొందరగా కనిపెట్టేస్తే మరికొందరు వెతుకులాట యుద్దం చేస్తున్నారు. కేవలం 5సెకెన్లలో ఫోటోలో ఉన్న జంతువును కనిపెట్టారంటే మీ బుర్ర బాగా పదునుగా ఉన్నట్టు, లేదంటే మీరు కాస్త మీ బ్రెయిన్ ను షార్ప్ చేసుకోవాల్సి ఉంటుంది. నేటికాలం ఉద్యోగాల ఒత్తిడి అంతా మెదడు మీదే ఉంటుంది కాబట్టి మెదడు చురుగ్గా ఉండటం చాలా అవసరం. అందుకోసం ఇది మొదడుకు మంచి వ్యాయామంలా తోడ్పడుతుంది. ఈ ఫోటోను ఫోటోగ్రాఫర్ ఆర్ట్ వోల్ఫ్ రూపొందించాడు. వానిషింగ్ యాక్ట్ లో భాగమైన ఈ ఫోటోలో ఉన్న ప్రాణి కుందేలులా అనిపిస్తుంది కానీ, అది కుందేలు కాదు. కుందేలు జాతికే చెందిన పికా అనే ఈ క్షీరదం ఆసియా, ఉత్తర అమెరికాలలో మాత్రమే కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఈ జంతువును కనిపెట్టి మీ దృష్టి వేరేవైపు మరల్చి ఆ తరువాత మళ్ళీ ఫోటో వైపు చూసినా ఇది మీకు తొందరగా దొరకదు. అదే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో ఉన్న ప్రత్యేకత. మరి మీ బ్రెయిన్ ను మీరు చెక్ చేసుకోండి

Read also: Viral Video: బారీకేడ్స్ రంధ్రాల్లోంచి వేళ్లు పెడుతూ ఎకసెక్కాలు.. చివరకు మనోడి పరిస్థితి ఏంటో మీరే చూడండి..!


.

Updated Date - 2023-03-09T14:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising