Viral: విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్.. సడన్‌గా శ్వాస తీసుకోవడం ఆపేసిన రెండేళ్ల పాప.. చివరకు..!
ABN, First Publish Date - 2023-08-30T11:01:35+05:30
ఒకవైపు విమానం గాల్లో ఎగురుతోంటే మరోవైపు ఆ పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదంలోకి జారుకుంది.. ఇలాంటి సమయంలో..
ప్రమాదాలు ఎప్పుడెలా ముంచుకొస్తాయో ఎవరూ చెప్పలేరు. అంతా సంతోషంగా ఉందన్న సమయంలో ఊహించనివిధంగా జీవితాలను అల్లకల్లోలం చేస్తాయవి. రెండేళ్ళ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు విమానం గాల్లో ఎగురుతోంటే మరోవైపు ఆ పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదంలోకి జారుకుంది. దీంతో విమానంలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. పాప పరిస్థితి చూసిన విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
బెంగుళూరు నుండి ఢిల్లీకి(Bengaluru to Delhi) బయలుదేరిన విస్తారా విమానంలో(Vistara Flight) ఊహించని సంఘటన చోటుచేసుకుంది. విమానంలో రెండేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలసి ప్రయాణం చేస్తోంది. విమానం గాల్లో ఎగురుతుండగా రెండేళ్ల పాపకు(2years old baby) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. అది చిన్నగా ఉన్నది కాస్తా పెద్దగా మారడంతో పాప తల్లిదండ్రులు భయపడిపోయారు. విమాన సిబ్బందికి సమస్యను తెలియజేశారు. పాప పరిస్థితి చూసి విమాన సిబ్బంది కూడా కంగారు పడిపోయారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్ ప్రకటించారు. ఆశ్చర్యంగా బెంగుళూరు నుండి ఢిల్లీకి వెళుతున్న అదే విమానంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) కు చెందిన ఐదు మంది వైద్యులు ఉండటంతో వారు అలర్ట్ అయ్యారు.
MGNREGS: ఉపాధి హామీ పనులకు వెళ్లే వాళ్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. ఆగస్టు 31వ తారీఖు లోపే ఈ పని చేయకపోతే..!
ఎయిమ్స్ వైద్యులు పాపను పరీక్షించి షాక్ అయ్యారు. పాప నాడి కొట్టుకోవడం లేదు, ఆమె కాళ్లు చేతులు చల్లబడిపోయాయి. పెదవులు చేతి వేళ్లు పాలిపోయాయి. ఆ తరువాత పాపకు సైనోటిక్ సమస్య ఉందని నిర్థారించారు. దీని వల్ల ఇంట్రాకార్టియాక్ రిపేర్ చేయాల్సి ఉందని, దానికి వెంటనే సర్జరీ చెయ్యాలని చెప్పారు. ఇందుకుగానూ వారే రంగంలోకి దిగారు. విమానంలో బహిరంగంగానే పాపకు చికిత్స మొదలుపెట్టారు. ఒకవైపు చికిత్స జరుగుతుండగానే విమానాన్ని నాగ్ పూర్ కు మళ్లించారు. అక్కడ వైద్యులు పాపకు సర్జరీ చేసి పాప ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉండని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనను AIIMS, New Delhi తన ట్విట్టర్ ఎక్స్ (Twitter X) అకౌంట్ నుండి షేర్ చేసింది. చిన్నారికి శస్త్రచికిత్స చేసి కాపాడినట్టు పేర్కొంది. సర్జరీకి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ వార్త విన్న నెటిజన్లు 'వైద్యులను ప్రత్యక్ష దేవుళ్లని అంటారు ఇందుకే' అని సదరు వైద్యులను, వారి కృషిని కొనియాడుతున్నారు.
Bank Holidays September 2023: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజుల సెలవులు.. ఈ నెలలో ఏఏ పండుగలున్నాయంటే..!
Updated Date - 2023-08-30T11:01:35+05:30 IST