Viral: జాబ్‌లో చేరిన 8 నెలల తర్వాత మొట్టమొదటిసారి లీవ్ అడిగిందో యువతి.. బాస్ రియాక్షన్ ఏంటో నెట్టింట షేర్ చేస్తే..!
ABN, First Publish Date - 2023-08-16T14:21:50+05:30
పాపం ఉద్యోగంలో చేరిన 8నెలల తరువాత లీవ్ అడిగిన ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె బాస్ ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం. '8నెలల తరువాత లీవ్ అడిగినందుకు నాకెదురైన పరిస్థితి ఇది' అంటూ ఆ యువతి స్వయంగా సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంది.
ఇప్పట్లో కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడం, తమ ఉద్యోగస్తుల చేత పనిచేయించుకోవడం వరకు బానే ఉంటున్నాయి. కానీ ఉద్యోగస్తులు శాలరీలు పెంచమని, సెలవు కావాలని అడిగినప్పుడు మాత్రం ముఖం చాటేస్తాయి. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే చాలామంది ఈ రెండు విషయాలలో ఇబ్బంది పడుతుంటారు. పాపం ఉద్యోగంలో చేరిన 8నెలల తరువాత లీవ్ అడిగిన ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె బాస్ ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం. '8నెలల తరువాత లీవ్ అడిగినందుకు నాకెదురైన పరిస్థితి ఇది' అంటూ ఆ యువతి స్వయంగా సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పెరుగుతున్న జనాభా కారణంగా అధికశాతం మంది ప్రైవేట్ ఉద్యోగాలలో సెటిల్ అవుతున్నారు. విద్యార్హత బాగుండి, ప్రతిభ ఉన్నవారికి కంపెనీలు వేతనాలు కూడా బానే ఇస్తుంటాయి. అయితే సెలవుల విషయం దగ్గరకు వచ్చేసరికి సమస్య ఎదురవుతుంటుంది. ఉద్యోగస్తులకు ఒకదాని తరువాత మరొక పని అప్పజెప్పడంలో చూపించినంత ఉత్సాహం, సెలవు అడగ్గానే గ్రాంట్ చెయ్యడంలో ఏ బాస్ కుడా చూపించడు. ఓ యువతికి ఎదురైన అనుభవం ఇప్పుడీ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. ఓ యువతి(young lady) 8నెలల కిందట కంపెనీలో కొత్తగా నియమితురాలైంది. పాపం ఆమె జాబ్ లో జాయిన్ అయిన రోజు నుండి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. అన్నిరోజులు కుటుంబానికి దూరంగా ఉంది. దీంతో ఆమె 8నెలల తరువాత తన కుటుంబం దగ్గరకు వెళ్లి గడిపిరావడానికి గానూ ఒకటిన్నర వారం రోజులు సెలవు అడిగింది(women asking leave). దీంతో ఆమె బాస్ ముఖం పాలిపోయింది. ఆమె ఏదో క్రైమ్ చేస్తున్నట్టే అతను ఎక్స్ర్పెషన్ ఇచ్చాడట. ఆ తరువాత ఆమెకు కొన్ని పనులు అప్పజెప్పి రేపటిలోగా సదరు పనులన్నీ పూర్తీచెయ్యమని ఆదేశించారు. ఆమె లీవ్ మీద వెళ్ళినా ప్రతిరోజూ ఇమెయిల్ చెక్ చెయ్యమని ఆర్డర్ వేశారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. కావాలంటే 4,5రోజులకు ఒకసారి ఇమెయిల్స్ చెక్ చేస్తాను అంతేకానీ నేను డైలీ చెక్ చేయను అని చెప్పింది. దీంతో ఆమె బాస్ ముఖంలో కోపం, తన ఉద్యోగి పట్ల అసహ్యం, ఏదో చెప్పలేని అనుమానం బయటపెట్టినట్టు చెప్పింది.
Food Habits: రోజూ పొద్దున్నే ఈ 5 రకాల టిఫిన్లను మాత్రం అస్సలు తినకండి.. పొరపాటున తింటే జరిగేది ఇదే..!
ఈ పోస్ట్ ను antiwork అనే Reddit ప్లాట్ ఫామ్ లో సదరు యువతి స్వయంగా షేర్ చేసింది. జరిగిన సంగతి మొత్తం అందులో చెప్పుకొచ్చింది. యువతి పోస్ట్ చూసిన నెటిజన్లు యువతి బాస్ మీద విరుచుకుపడుతున్నారు. ఇలాంటి కంపెనీల గురించి ఎండగడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఉద్యోగం విషయంలో తాము ఎలా ఉంటున్నామో చెబుతున్నారు. 'ల్యాప్టాప్ లో మీ వ్యక్తిగత సమాచారం ఉంటే తప్ప ఆ ల్యాప్టాప్ ను మీ వెంట అస్సలు తీసుకెళ్ళకండి. సెలవు తీసుకోవడం అంటే ఇంటికెళ్ళి పనిచేయడం కాదు, పని ఒత్తిడి నుండి రిలాక్స్ అవ్వడం' అని ఒకరు కామెంట్ చేశారు. 'నేను సెలవులో ఉన్నప్పుడు నా వర్క్ అకౌంట్ బ్లాక్ లో పెడతాను. తిరిగి వర్క్ సమయంలో అన్ బ్లాక్ చేస్తాను' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'మీరు సెలవు తీసుకుని కూడా ఇలా వర్క్ చేస్తే అది సెలవులో ఉన్నట్టు కాదు, పనిచేసినట్టు' అని మరికొందరు అంటున్నారు.
Health Tips: నోట్లో పెదాల కింద ఇలాంటి పొక్కులు వచ్చాయా..? అసలు ఇవెందుకు వస్తాయో తెలిస్తే..!
Updated Date - 2023-08-16T14:28:22+05:30 IST