Virat Kohli SSC Marks: ఆ సబ్జెక్ట్‌లో కోహ్లీ చాలా వీక్ అన్నమాట.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల షీట్..!
ABN, First Publish Date - 2023-03-31T15:22:37+05:30
స్కూల్లో ఒక వ్యక్తి సంపాదించుకునే మార్కులు, అతడి భవిష్యత్తును నిర్ధారించలేవని ఇప్పటికే ఎంతో మంది రుజువు చేశారు. తరగతి గదిలో వెనుకబడిన ఎంతో మంది ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరుకుని ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు.
స్కూల్లో ఒక వ్యక్తి సంపాదించుకునే మార్కులు (Marks in Exams), అతడి భవిష్యత్తును నిర్ధారించలేవని ఇప్పటికే ఎంతో మంది రుజువు చేశారు. తరగతి గదిలో వెనుకబడిన కొందరు ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరుకుని ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు. ఇటీవల ఓ ఐయేఎస్ అధికారి మార్కుల షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడికి పదో తరగతిలో చాలా చాలా తక్కువ మార్కులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల షీట్ (Virat Kohli SSC Marks) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) 2004లో పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు. ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో ఉన్న సేవియర్ కాన్వెంట్‌లో విరాట్ చదువుకున్నాడు. కోహ్లీ పదో తరగతిలో 69 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, సైన్స్‌లో 55, సోషల్‌లో 81, ఇంట్రడక్టరీ సైన్స్‌లో 58 మార్కులు, మ్యాథ్స్‌లో 51 మార్కులు సాధించాడు. తాను మ్యాథ్స్‌లో (Kohli Week in Mathematics) చాలా వీక్ అని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే.
Coin Started Flying: 4 స్పూన్లు.. 4 చిన్న బ్యాటరీలు.. ఇలా పెట్టగానే గాల్లోకి లేచిన రూపాయి కాయిన్.. ఇదేం వింత అనుకుంటున్నారా..?
కోహ్లీ మార్కుల షీట్‌ను Mufaddal Vohra అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral) అవుతోంది. ఇప్పటికే 17 వేలకు పైగా లైక్స్ సాధించింది. చాలా మంది రీ-ట్వీట్‌లు కూడా చేస్తున్నారు. ``కోహ్లీ కూడా నా లాగే మ్యాథ్స్‌లో వీక్`` అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
Amazing: కంటికి కనిపించని వింత.. ఈ సాసర్‌పై కాఫీ కప్పును పెట్టగానే ఏం జరిగిందో చూస్తే అవాక్కవడం ఖాయం..!
Updated Date - 2023-03-31T15:22:37+05:30 IST