Strange Rules in Israel: పెళ్లిళ్లలో ఏటీఎం మెషీన్లు.. శనివారం హాలీడే.. ఇజ్రాయెల్‌లో 15 వింత నిబంధనలు..!
ABN, First Publish Date - 2023-10-18T16:40:28+05:30
ఇజ్రాయెల్ వాసులు సంవత్సరానికి ఒకసారి యోమ్ కిప్పూర్ పండుగ సందర్భంగా వీధుల్లో సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు.
ఇజ్రాయెల్ లో 8 వింత నియమాలున్నాయి.. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల జీవనశైలి మనల్ని ఇంకాస్త ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడి కొన్ని వింతలు, విశేషాలు తెలుసుకుందాం రండి.
శనివారం సెలవు..
ఇజ్రాయెల్ లో శనివారాల్లో అన్నీ మూసేస్తారు. ప్రజా రవాణా కూడా మూతబడిపోతుంది. ప్రతి ఒక్కరూ శుక్రవారం మాత్రమే తమ షాపింగ్ పూర్తిచేసుకుంటారు. ఎందుకంటే శనివారం కుటుంబంతో గడపాలని చూస్తారు.
పింగ్ పాంగ్ గేమ్ పాపులర్..
ఇజ్రాయెల్ బీచ్ లలో చాలావరకూ పింగ్ పాంగ్ ఆడుకోవడం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.
రెస్టారెంట్ లో సమయం
ఇక్కడి రెస్టారెంట్ లో కావలిసినంత సేపు తినచ్చు. టేబుల్ ఖాళీ చేయడం గురించి ఎవరూ ఎవరినీ అడగరు.
సైన్యంలో సేవ..
ఇజ్రాయెల్ పౌరులు తమ జీవితంలో ఒక్కసారైనా సైన్యంలో పనిచేయాలి. దీనిని రిజర్వ్ డ్యూటీ అని అంటారు.
రొట్టెల కష్టం..
ఇజ్రాయెల్ లో పస్కా పండుగకు ముందు మార్కెట్ లో రొట్టెలు దొరకడం చాలా కష్టం.
ఫోన్ బిల్లు
ఇజ్రాయెల్ లో ఫోన్ బిల్లు పై బేరం ఆడచ్చు.
ఉద్యోగం లేదా విద్య
ఇజ్రాయెల్ లో ప్రజలందరూ ఎవరినీ వారు ఉద్యోగం, చదవు గురించి ఎక్కువగా మాట్లాడరు. తీర్పులు ఇవ్వరు.
ఇదికూడా చదవండి: ఈ 4 లక్షణాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న మగాళ్లు.. నిజంగా అదృష్టవంతులేనట..!
డబ్బును బహుమతిగా ఇచ్చే ధోరణి..
ఇజ్రాయెల్ లో పెళ్ళిళ్లకి డబ్బు బాగా బహుమతులు ఇచ్చే ట్రెండ్ ఉంటుంది. అందుకే పెళ్ళిళ్ళలో కూడా చాలా సార్లు ఏటీఎం మెషిన్లు అమర్చుతారు.
రోడ్లప్ సైకిల్ తొక్కుతున్నారా
ఇజ్రాయెల్ వాసులు సంవత్సరానికి ఒకసారి యోమ్ కిప్పూర్ పండుగ సందర్భంగా వీధుల్లో సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు. కొన్ని వింతగా, విడ్డూరంగా ఉన్నాకూడా ఇవన్నీ ఓ దేశం సాంప్రదాయాలు.. సంస్కృతులలో భాగంగా ఉంటూ వస్తున్నాయి. మరిన్ని వింతలు చూడాలంటే మనం ఇజ్రాయెల్ వరకూ ప్రయాణం కట్టాలేమో.. వెళ్ళోద్దామా మరి అటు..
Updated Date - 2023-10-18T16:40:36+05:30 IST