ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RIPSagar: వి.వి.వినాయక్, శ్రీను వైట్ల గురువు సాగర్

ABN, First Publish Date - 2023-02-02T11:51:40+05:30

1990 జనవరిలో చిరంజీవి 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమా మీద పోటీగా సాగర్ ఇంచుమించు అలాంటి పేరుతో 'స్టూవర్టుపురం దొంగలు’ తీసి మంచి విజయం సాధించారు. రామ్ లక్ష్మణ్ హీరోలుగా 'ఖైదీ బ్రదర్స్' సినిమా కూడా సాగర్ చేసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ దర్శకుడు సాగర్ (RIPSagarGaru) గారు ఈరోజు అంటే గురువారం, ఫిబ్రవరి 2, 2023 న చెన్నై లో తుది శ్వాస విడిచారు. అతని వయస్సు 71 సంవత్సరాలు. సాగర్ పూర్తిపేరు ఉయ్యూరు విద్య సాగర్ రెడ్డి. ఇతను మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామంలో మార్చి 1, 1952 లో జన్మించారు. సుమారు 30 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ గారు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) గారితో 'అమ్మదొంగా' (Amma Donga) అనే సినిమా సాగర్ గారి కెరీర్ లో పెద్ద హిట్ అయిన సినిమా. సాగర్ దర్శకత్వం, నిర్మాతగా చేసిన 'రామసక్కనోడు' సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. అలాగే అతను నిర్మాతగా 'ఆశల పల్లకి' అనే పిల్లల మీద చేసిన సినిమా చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చెయ్యటమే కాకుండా, అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఆసక్తికర అంశం ఏంటి అంటే ఇప్పటి ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్ (VV Vinayak), శ్రీను వైట్ల (Srinu Vailta) లాంటి వారు సాగర్ గారి దగ్గర శిష్యరికం చేసి ఈరోజు అగ్ర దర్శకులు అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి సాగర్ గారే గురువు. 'అమ్మ దొంగా', 'జగదేక వీరుడు', 'అమ్మ నా కోడలా', 'ఓసి నా మరదలా' లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

అప్పట్లో మద్రాస్ లో చదువు బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో సాగర్ గారి విద్యాభ్యాసం ఎక్కువగా చెన్నై లో జరిగింది. అప్పట్లో ఎస్.ఎల్.సి. అంటే ఇప్పుడు అది 10వ తరగతి అనుకోవచ్చు, వరకు చదివారు సాగర్, ఆ తరువాత అక్కడే ఎదో జాబ్ చూసుకొని సెటిల్ అవ్వాలని అయన ఉద్దేశం. సాగర్ అన్నయ్య బి.హెచ్. రెడ్డి సినిమా పరిశ్రమలో బి.వి. ప్రసాద్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. సాగర్ మొదట గా శ్రీహరి వద్ద ‘ఇంటి గౌరవం’ అనే సినిమాకి ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‍ లో సహాయకుడిగా చేరారు. చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటి పని ఇక్కడే సాగర్ కి మొదలయింది. తరువాత దర్శకుడు బి.వి. ప్రసాద్ తీసిన ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశారు సాగర్. ఆలా ఎడిటింగ్ నుండి దర్శకత్వం వైపు దృష్టి మరల్చారు సాగర్. ఆలా అతని దగ్గరే చాల సినిమాలకు సహాయ దర్శకుడిగా చేసిన సాగర్ కృష్ణ నటించిన 'నాయుడుగారి అబ్బాయి' కి కూడా పని చేసారు. తరువాత కోదండ రామిరెడ్డి దగ్గర కృష్ణ గారి ఇంకో సినిమా 'కిరాయి కోటిగాడు' కి కూడా సాగర్ పని చేశారు. ఇలా ఎక్కువగా కృష్ణ గారి సినిమాలకి పని చెయ్యడంతో కృష్ణ గారితో కొంచెం సాన్నిహిత్యం ఏర్పడింది సాగర్ కి.

దర్శకుడిగా మొదటి సినిమా కృష్ణ గారితో చెయ్యాలని ఒక కథ కూడా రాసుకొని కృష్ణ గారిని కలిశారు సాగర్, కానీ అతను అప్పట్లో చాల బిజీ నటుడు అవటం వలన కుదరలేదు. ఆలా ప్రయత్నిస్తున్న సమయంలో విజయనిర్మల గారి దగ్గర సహాయ దర్శకుడిగా వున్నా విఠల్ అనే అయన నరేష్, విజయశాంతి లీడ్ పెయిర్ గా సినిమా చెయ్యమని అడిగితే దానికి ఒప్పుకున్న సాగర్ ఆలా మొదటి సినిమా 'రాకాసిలోయ' తో దర్శకుడిగా మారారు. నరేష్ (VK Naresh) తో పాటు విజయశాంతి (Vijayashanthi), రాజేష్, అరుణ, రంగనాథ్, దీప లాంటి నటులు ఇందులో నటించారు. ఈ సినిమా 1983 లో విడుదలై మంచి విజయాన్ని సాగర్ గారికి ఇచ్చింది. తరువాత సుమన్, భానుచందర్ కాంబినేషన్ తో ‘డాకు’ అనే సినిమా తీశారు సాగర్, ఇది కూడా బాగానే ఆడింది. దర్శకత్వం తో పాటు నిర్మాతగా కూడా మారి చేసిన ‘మా వారి గోల’. ఇదొక కామెడీ సినిమా, ఇందులో నరేష్, మనోచిత్ర లీడ్ పెయిర్ కాగా ఇది పెద్ద ఫెయిల్యూర్ అయింది. ఇది 1986 లో విడుదల అయింది.

ఆ తరువాత మూడేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ యాక్షన్ సినిమా తీద్దామని 1989 లో భానుచందర్ తో ‘స్టూవర్టుపురం దొంగలు’ అనే సినిమా చేసారు. జనవరి 9, 1990 నాడు ఈ సినిమా విడుదల అయింది. అయితే అప్పట్లోనే చిరంజీవి సినిమా ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ కి పోటీగా వచ్చింది అని అన్నారు. ఎందుకంటే చిరంజీవి సినిమా సాగర్ సినిమా కన్నా ఒక వారం ముందు విడుదల అయింది. ఆసక్తికరం ఏంటి అంటే, సాగర్ సినిమా ఘనవిజయం సాధించింది, చిరంజీవి సినిమా అంతగా నడవలేదు. ఈ విజయంతో సాగర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వరసగా సినిమా చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో యాక్షన్ దర్శకులుగా అగ్రగణ్యులుగా వున్న రామ్ లక్ష్మణ్ సోదరులును లీడ్ యాక్టర్స్ గా పెట్టి సాగర్ గారు 'ఖైదీ బ్రదర్స్' అనే ఒక సినిమా చేసారు.

సాగర్ సోదరులు అందరూ చిత్రపరిశ్రమతో అనుబంధం వున్నవారే. సాగర్ అన్నయ్య సహాయ దర్శకుడిగా పని చేసారు, అలాగే తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా చేశారు, ఇతను కూడా చనిపోయారు. ఇంకో తమ్ముడు నాగి రెడ్డి కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. సాగర్ గారి అబ్బాయి చందు కూడా పరిశ్రమలోనే వుంటున్నారు.

Updated Date - 2023-02-02T11:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising