ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Water Purifier: వాటర్ ఫ్యూరిఫైయర్ వాడుతున్నారా? ఈ నిజాలు తెలుసా?

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:16 PM

వాటర్ ఫ్యూరిఫైయర్లు నీటిని శుద్దిచేయడంతో పాటు మినరల్స్ ను కూడా జోడించడంతో చాలా ఇళ్లలో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడుతున్నారు. కానీ చాలామందికి ఈ నిజాలు తెలియవు.

నేటి కాలంలో స్వచ్చమైన నీరు దొరకడం కష్టంగా మారింది. ఒకప్పుడు బావులలో నీరు తాగినా ఏ రోగాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఇంట్లో కుళాయిలకు ఫిల్టర్స్ వాడినా సరే నీరు స్వచ్చంగా ఉండదు. ఇలాంటి నీరు తాగితే తొందరగా అనారోగ్యాల బారిన పడటం ఖాయం. అందుకే చాలామంది మినరల్ వాటర్ క్యాన్లు తెచ్చుకుంటారు. రోజూ తెచ్చుకోవడం శ్రమగా భావించేవారు వాటర్ ఫ్యూరిపైయర్లను ఇంట్లోనే ఏర్పాటు చేయించుకుంటారు. ఇవి నీటిని శుద్దిచేయడంతో పాటు మినరల్స్ ను కూడా జోడించడంతో చాలా ఇళ్లలో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడుతున్నారు. పలు కంపెనీలు వాటర్ ఫ్యూరిపైయర్లను తక్కువ ధరకు అందించడంతో వీటి వాడకం ఈ మద్యకాలంలో బాగా పెరిగింది. అయితే వాటర్ ఫ్యూరిపైయర్లు వాడుతున్న చాలామందికి తెలియని నిజాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే..

ఫిల్టర్ విషయంలో జాగ్రత్త పడుతున్నారా?

సాధారణంగా వాటర్ ఫ్యూరిపైయర్లు వాడేవారు నీటిని ఫిల్టర్ చేసే కాయిల్స్ గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫిల్టర్ ను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్పించాలి. ఇది కాకుండా ప్రైమరీ ఫిల్టర్ ను సంవత్సరానికి ఒకసారి మార్పించాలి. అదే విధంగా వాటర్ ప్యూరిపైయర్ మిషన్ లో ఒక పొర ఉంటుంది. దీన్ని కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి మార్పించాలి.

ఇది కూడా చదవండి: పరగడుపునే మెంతులు నానబెట్టిన నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందంటే..!


ఎప్పుడూ ఆన్ లోనే ఉంచుతుంటారా?

ఆర్ఓ సిస్టమ్ ను అన్ని సమయాల్లో ఆన్ లో ఉంచకూడదు. చాలామంది ఎల్లప్పుడూ ఫ్యూరిపైయర్ ను ఆన్ లోనే ఉంచుతుంటారు. ఒకవైపు నీటిని ఒంపుకోగానే మరోవైపు నీరు భర్తీ అవుతుంటుంది. చాలా వరకు మన్నికగా ఉన్న ప్యూరిపైయర్లు తక్కువ లీటర్లతో ఉంటాయి. ఈ కారణంగా అందరూ ఈ పని చేస్తుంటారు. కానీ ఇలా ఎప్పుడూ ఆన్ లో ఉంచడం వల్ల ఫ్యూరిపైయింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది.

క్లీన్ చేస్తుంటారా?

చాలామంది వాటర్ ఫ్యూరిపైయర్లు బిగించిన తరువాత వాటి గురించి పట్టించుకోరు. అది ట్రబుల్ ఇచ్చేవరకు కనీసం ఫిల్టర్స్ ను కూడా మార్పించరు. ఇక క్లీనింగ్ ను ఫాలో అయ్యేవారు చాలా తక్కువ. కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫ్యూరిఫయర్ లో వాటర్ ట్యాంక్ ను క్లీన్ చెయ్యాలి.

ఎలా క్లీన్ చెయ్యాలి?

ఫ్యూరిఫైయర్ లో వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేయడానికి ముందుగా నీటిని తొలగించాలి. ఆ తరువాత నిమ్మ తొక్కలతో ట్యాంక్ లోపల శుభ్రం చేయాలి. ఇది ట్యాంక్ లోపల సూక్ష్మ క్రిములను తొలగిస్తుంది. ఆ తరువాత శుభ్రమైన నీటితో ట్యాంక్ ను శుభ్రం చెయ్యాలి. ఫ్యూరిపైయర్ల లోపల ట్యాంక్ ఓపెన్ చేసే నైపుణ్యం లేకపోతే దీన్ని ప్యూరిపైయర్లను బిగించే, రిపేర్ చేసే టెక్నీషియన్ల సహాయంతో క్లీన్ చెయ్యడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మునగ ఆకులు తింటే కలిగే టాప్ 8 లాభాలివీ..!

Updated Date - Dec 31 , 2023 | 12:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising