Weird Law: అమ్మ బాబోయ్ ఇదేం చట్టం.. ఎదుటి వారికి కోపం తెప్పించినా జైల్లో వేస్తారట.. ఈ వింత రూల్ ఎక్కడంటే..?
ABN, First Publish Date - 2023-02-28T11:32:32+05:30
నవ్వడం, ఏడవడం, సంతోషంగా ఉండటం ఇవన్నీ ఎలాగో కోపం కూడా ఒక ఫీలింగ్ కదా.. మనమేమైనా పనిగట్టుకుని కోపం తెచ్చుకుంటామా అనిపిస్తుంది. కానీ..
తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష.. అని సుమతీ శతకకర్త ఎప్పుడో చెప్పారు. కానీ నవ్వడం, ఏడవడం, సంతోషంగా ఉండటం ఇవన్నీ ఎలాగో కోపం కూడా ఒక ఫీలింగ్ కదా.. మనమేమైనా పనిగట్టుకుని కోపం తెచ్చుకుంటామా అనిపిస్తుంది. అయితే కోపం మనిషిలో విచక్షణను చంపేస్తుంది. బంధాలు విచ్చిన్నం కావడానికి కూడా ప్రధాన కారణం అవుతుంది. అందుకే చాలా మంది కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదని చెబుతారు. ప్రజలు ఇబ్బంది పడినా కోపాన్ని కంట్రోల్ లో పెట్టడానికి కొన్ని దేశాలు వింత రూల్స్ పెట్టాయి. కోప్పడితే జైల్లో వేస్తామని చెబుతున్నాయి. ఈ వింత రూల్ గురించి, ఈ దేశం గురించి తెలుసుకుంటే..
ఆగ్నేయాసియా(Southeaste Asia)లో ఫిలిప్పీన్(Philippine) ఒక దేశం. ఈ దేశంలో కోప్పడేవాళ్ళను కంట్రోల్ చెయ్యడానికి అక్కడి ప్రభుత్వాలు రూల్ పెట్టాయి. ఎవరైనా కోపం తెచ్చుకున్నా, ఎవరైనా ఇతరులకు కోపం తెప్పించినా ఇక్కడ నేరుగా జైలు గోడల మధ్య ఊచలు లెక్కబెడుతూ కూర్చోవాల్సిందేనట. ఇదేమీ నిన్నా మొన్నా పుట్టుకొచ్చిన రూల్ కాదండోయ్. 1930లోనే దీన్ని చట్టంచేశారు. అయితే ఈ రూల్ గురించి తెలిసిన వాళ్ళు చాలాతక్కువ. ఈ కారణంగా తమకు తెలియకుండానే తప్పు చేసేసి జైలుకు వెళుతున్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఫిలిప్పీన్ మంచి పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడికి వెళ్ళే టూరిస్ట్ లు కూడా ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలని చెబుతున్నారు.
ఫిలిప్పీన్ లో అమలు చేస్తున్న ఈ చట్టం గురించి ఇతర దేశాల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. కోప్పడితే జైల్లో వేసేస్తారా సార్.. అంటూ గగ్గోలు పెట్టాయి. అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఒత్తిడి భరించలేక ఈ విషయంలో ఫిలిప్పీన్ ఓ అడుగు దిగి ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా ఎవరికి అయినా కోపం తెప్పిస్తేనే ఈ రూల్ అంటూ 2020లో కొన్ని సవరణలు చేసింది. హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు మరో పది అడుగులు పైకి వేసి అప్పటి వరకు 3పౌండ్లు ఉన్న జరిమానాను ఏకంగా 75పౌండ్లకు పెంచింది. ప్రస్తుతం ఫిలిప్పీన్ లో ఎవరైనా ఎవరికైనా కోపం తెప్పిస్తే 30రోజుల జైలు శిక్ష, 75పౌండ్ల (7500 రూపాయలు, 7500Rupees) జరిమానా విధిస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మరొక రూల్ కూడా ఉంది. ఎవరైనా ఎక్కడైనా క్యూలో నిలబడుకుని ఉన్నప్పుడు ముందున్న వాళ్ళను తోయడం, నెట్టడం వంటివి చేయకూడదు అలా చేస్తే అది కూడా నేరం కిందకే వస్తుందని చెబుతున్నారు. తోసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నేరుగా జైలుకే నడవాలంట.
Updated Date - 2023-02-28T11:32:32+05:30 IST