అబ్బ.. ఏం ఐడియా గురూ.. రైల్లో ప్రయాణిస్తూ.. నిద్ర మత్తులో పక్కనున్న వాళ్ల మీద పడితే తిడుతున్నారని..
ABN, First Publish Date - 2023-02-15T16:13:57+05:30
ఎవరైనా తూగుతూ మనమీద పడితే చెప్పలేనంత చిరాకు వస్తుంది. కాస్త కోపిష్టి మనుషులు అయితే ఏకంగా తిట్ల దండకం మొదలెడతారు. ఇలాంటి అనుభవాలన్నీబాగా విసుగుతెప్పించాయేమో ఓ బాబాయ్ తెలివిగా ఆలోచించాడు.
మామూలు సమయాల్లో నిద్ర వచ్చినా రాకపోయినా ప్రయాణాలు చేసేటప్పుడు చాలామందికి భలే నిద్రవస్తుంది. బస్సుల్లోనూ, ట్రైన్లలోనూ ప్రయాణం చేసేటప్పుడు కూర్చుని తూగడం సహజంగా చూస్తుంటాం. ఎవరైనా తూగుతూ మనమీద పడితే చెప్పలేనంత చిరాకు వస్తుంది. కాస్త కోపిష్టి మనుషులు అయితే ఏకంగా తిట్ల దండకం మొదలెడతారు. ఇలాంటి అనుభవాలన్నీబాగా విసుగుతెప్పించాయేమో ఓ బాబాయ్ తెలివిగా ఆలోచించాడు. అతని ఆలోచన ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఒక వ్యక్తి ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు. అతను కింద బెర్త్ లో సహప్రయాణికులతో కలసి కూర్చున్నాడు. కూర్చుని ఉండగానే బాగా నిద్రవచ్చేసింది. పడుకుందామంటే స్లీపింగ్ బెర్త్ కాదు. దీంతో తెలివిగా ఆలోచించాడు. తన టవల్ తీసుకుని పైన బెర్త్ కు టవల్ ను కట్టేశాడు. తరువాత మరొక కొనకు తన తలను కట్టేసుకున్నాడు. దీంతో నిద్రలో కూడా అతని తల ఊగకుండా అతను పక్కవాళ్ళ మీద పడకుండా స్టేబుల్ గా ఉన్నాడు. ఇతని విన్యాసాన్ని ట్విట్టర్ లో షేర్ చెయ్యడంతో భలే వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ADG దీన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి హ్యాష్ ట్యాగ్ గా 'incredible india'అని జతచేశాడు. మొత్తానికి మనోళ్ళ దగ్గర ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది అంటున్నారు నెటిజన్లు.
Updated Date - 2023-02-15T16:13:59+05:30 IST