ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bank Locker Rules: బ్యాంకు లాకర్లను వాడుతున్నారా..? ఈ రూల్స్ ముందే తెలుసుకోండి.. అదే జరిగితే ఒక్క రూపాయి కూడా రాదు..!

ABN, First Publish Date - 2023-09-28T22:20:37+05:30

బ్యాంకు లాకర్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: విలువైన వాటిని బ్యాంకు లాకర్లలో దాచుకోవాలనేది మనలో చాలా మందికి తెలిసిందే. కానీ ఏ వస్తువులు లాకర్‌లో పెట్టాలో తెలిసుండాలని కూడా నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కస్టమర్లే కష్టాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ లాకర్‌లో దాచుకున్న రూ.18 లక్షల విలువైన కరెన్సీ నోట్లకు చెదలు పట్టి నాశనం కావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అసలు లాకర్‌లో నగదు పెట్టొచ్చా? లాకర్‌లోని క్యాష్‌కు ప్రమాదం వాటిల్లితే బ్యాంకు పరిహారం చెల్లిస్తుందా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇలాంటి అంశాలకు సంబంధించి ఆర్బీఐ సవివవరమైన మార్గదర్శకాలు(Bank locker rules) జారీ చేసింది.


ఆర్బీఐ నిబంధనల ప్రకారం, కస్టమర్లు బ్యాంకు లాకర్లలో నగలు, లీగల్ డాక్యుమెంట్లు, ఇతర చట్టబద్ధమైన వస్తువులు మాత్రమే పెట్టుకోవాలి. ఆయుధాలు, నగదు, విదేశీ కరెన్సీ నోట్లను లాకర్లలో దాచకూడదు. లాకర్‌లో పెట్టిన నగదుకు నష్టం వాటిల్లితే బ్యాంకు బాధ్యత వహించదని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పరిహారం(Compensation) కింద పైసా కూడా చెల్లించవని తేల్చి చెబుతున్నాయి. అంతేకాకుండా, లాకర్ తాళం లేదా పాస్‌‌వర్డ్ పోయినా, దురుపయోగమైనా బ్యాంకుకు సంబంధం ఉండదు.

ఇక లాకర్‌లో దాచుకున్న ఇతర వస్తువులు పాడైనప్పుడు బ్యాంకులు ఇవ్వాల్సిన పరిహారంపై కూడా ఆర్బీఐ స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, లాకర్ అద్దెకు గరిష్ఠంగా 100 రెట్ల పరిహారాన్ని మాత్రమే బ్యాంకులు చెల్లి్స్తాయి. కాబట్టి, లాకర్‌తో మరీ విలువైన వస్తువులు దాచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం, అగ్నిప్రమాదం, దోపిడీ, బ్యాంకు భవనం కూలిన సందర్భాల్లో కస్టమర్లు తమ ల్యాకర్లలో దాచుకున్న వస్తువులు నష్టపోతే బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది. అయితే, భూకంపం, వరదలు లేదా ఇతర ప్రకృతి విపత్తులతో నష్టం వాటిల్లితే మాత్రం బ్యాంకు ఎటువంటి బాధ్యతా వహించదు.

Updated Date - 2023-09-28T22:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising